కాబోతుంది బీఆర్ఎస్ పాలన అంతం -రాబోతుంది అధికారంలోకి కాంగ్రెస్ హస్తం అధికారం కోల్పోతున్నామని అయోమయంలో కేటీఆర్.
భువనగిరి టౌన్ జనం సాక్షి:—-_భువనగిరి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కుంభం అనిల్ కుమార్ గారు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది..ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు మోత్కుపల్లి నర్సింహులు , డీసీసీ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు హాజరయ్యారు.కుంభం అనిల్ కుమార్ రెడ్డి
మాట్లాడుతూ.ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేసిన యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ నాయకులను అసభ్య పదజాలంతో దూషించిన కేటిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.కేటీఆర్ కి బీఆర్ఎస్ ఓడిపోతుందన్న భయం పట్టుకుందని అందుకే ఇష్టం వచ్చినట్టు దూషణ చేస్తున్నారని వారికి మరో పది రోజుల్లో ప్రజలే బుద్ది చెప్తారని అన్నారు.నేడు తెలంగాణలో అన్ని వర్గాలు కెసిఆర్ ప్రభుత్వంపై అసహనంతో ఉన్నారని ఈ సారి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి ని ఇంటికీ పంపడం ఖాయమని అన్నారు.అలాగే ప్రతిపక్ష నాయకులను అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.మాజీ మంత్రి మోత్కుపల్లి మాట్లాడుతూ.దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని, దళితబిడ్డనే ముఖ్యమంత్రి ని చేస్తానని చెప్పిన కెసిఆర్ ఆ మాటలే మర్చిపోయారని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కెసిఆర్ వాళ్ళ ఇంట్లో తప్ప ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.ఈ సారి ప్రతీ ఒక్క కార్యకర్త కాంగ్రెస్ గెలుపుకై అలుపెరుగని పోరాటం చేయాలని ప్రజలను కోరారు
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్, టీపీసీసీ డెలిగేట్ తంగెల్లపల్లి రవికుమార్, టీపీసీసీ సభ్యులు జనగాం ఉపేందర్ రెడ్డి, పట్టణ, మండల ప్రజా ప్రతినిధులు,యూత్ కాంగ్రెస్,సిపిఐ నాయకులు,మహిళల విభాగం సభ్యులు, వివిధ అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు.