కామ్రేడ్ వెంకటనర్సమ్మ పార్దివదేహంతో బయ్యారంలో ఊరేగింపు
కామ్రేడ్ వెంకట నర్సమ్మ జీవితం ఆదర్శవంతం
-కామ్రేడ్ వెంకటనర్సమ్మ పార్దివదేహంతో అమర్ రహే నినాదాల మధ్య బయ్యారంలో ఊరేగింపు
-కామ్రేడ్ వెంకటనర్సమ్మ బయ్యారం సిపిఐ ఎంఎల్ ఘన నివాళి
బయ్యారం, జూన్ 22(జనంసాక్షి):
కామ్రేడ్ గడ్డం వెంకట నర్సమ్మ జూన్ 22 రాత్రి 2 గంటల సమయంలో అమరులయ్యారు.కొంత కాలం గా తీవ్ర అనారోగ్యంతో వుండి, రాత్రి చనిపోయారు.
ఆమె ఖమ్మం లో పార్టీ ,తన కుటుంబ సభ్యుల సంరక్షణ లో వున్నారు.పార్టీ రోజూ వారి అవసరాలు,వైద్యం అందించింది.చివరలో పార్టీ హాస్పిటల్ లో చేర్చి వైద్యం అందించినా వయస్సు,సుదీర్ఘకాలం గా వున్న అల్సర్,ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఆమెను వేదించాయి.గత వారం రోజులుగా ఆహారం,క్రమంగా మంచి నీళ్ళు కూడా తీసుకోలేని పరిస్థితి లో వుండి ,జూన్ 22 రాత్రి మరణించారు.
ఆమె సుదీర్ఘ కాలంగా విప్లవ కమ్యూనిస్ట్ ఉద్యమం తో మమేకమై వున్నారు.కమ్యూనిస్ట్ కుటుంబంగా జీవించారు. చనిపోయే నాటికి సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా సభ్యురాలిగా వున్నారు.కాస్తా తిరగ కలిగిన కాలం వరకు ఖమ్మం పట్టణ కమిటీ సభ్యురాలుగా వున్నారు.చివరి సారిగా 28ఫిబ్రవరి 2022 న ఖమ్మం లో జరిగిన సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా తెలంగాణా రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం లో పాల్గొని ప్రసంగించారు.కామ్రేడ్ సరోజినీ అక్కతో కలిసి ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.గడ్డం
వెంకట నరసమ్మ ఖమ్మం పట్టణంలో లో వడ్డాలపు మీనయ్య,అచ్చమ్మ ల నాల్గవ సంతానం వెంకట నరసమ్మ నాలుగో తరగతి వారికి చదువుకున్నారు. ఎనిమిదేళ్ల వయస్సులోనే ఆమెకి వివాహం జరిగింది. కామ్రేడ్ గడ్డం వెంకటరామయ్య వివాహం జరిగింది. వీరిది దూరపు చుట్టరికం .1946 కంటే ముందు వీరి వివాహం జరిగింది .ఈమె 1938 లో జన్మించారు. గడ్డం వెంకట్రామయ్యది మరిపెడ బంగ్లా దగ్గర విస్సంపల్లి గ్రామం.
ఆ తరువాత వారు బయ్యారం మండలం పెతాల్లగడ్డ గ్రామానికి వెళ్లారు .అక్కడే వ్యవసాయం చేస్తూ,ఆయిల్ గానుగ బడుతూ జీవించేవారు. ఈ క్రమంలో లో కమ్యూనిస్టు పార్టీతో ఏర్పడ్డ సంబంధాలు కామ్రేడ్ వెంకట్రామయ్య ఉద్యమంలోకి ఆకర్షించింది. రజాకార్లు దాడులు పెరిగిపోయిన నేపథ్యంలో ఆయన అజ్ఞాతవాసం లోకి వెళ్ళాడు. రజాకార్లు పోలీసులు ఆయన ఆచూకీ కోసం వెంకట నరసమ్మని వేధించడం ప్రారంభించారు.ఇల్లు సోదా చేయడం ,ఇబ్బందులకు గురి చేయడం చేశారు. వ్యవసాయం కూడా బంద్ చేయించారు.
ఈ ఇబ్బందులకి తాళలేక ఆమె ఖమ్మం వెళ్ళారు. వారి కుటుంబం,బంధువుల ఆసరాతో ఖమ్మం లో జీవించారు.వెంకట్రామయ్య జైలు నుంచి విడుదల అయిన తరువాత తిరిగి మానుకోట వెళ్లారు.ఒక సంవత్సర కాలం జీవించారు. మానుకోటలో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ హామాలి పనిచేస్తూ జీవించారు. మానుకోట నుంచి తిరిగి పెతాళ్లగడ్డ వెళ్లారు.
వెంకట నరసమ్మ వెంకట్రామయ్య దంపతులకు ఐదుగురు సంతానం. భారతి, రాజేశ్వరరావు, కళావతి, వైజేశ్వర్రావు,లైలా.వెంకట నరసమ్మ దంపతులు వెంకట్రామయ్య అన్న సత్యనారాయణ చనిపోగా ఆయన బిడ్డ ఆరు నెలల వయస్సు గల రుక్కమ్మ ను చేరదీసి పెంచుకున్నారు.
1969 ఏప్రిల్ లో తీవ్ర కరువు వచ్చింది. అదే సంవత్సరం ఊరు కాలిపోయింది. జొన్న చేలు వేశారు. ఆ జొన్న చేల దగ్గరికి కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి పొత్తూరి వెంకటేశ్వరరావు తదితరులు వచ్చి కామ్రేడ్ వెంకట్రామయ్య ని కలిసి వెళ్లేవారు. ఉద్యమంలో పనిచేయమని కోరారు. వారి ప్రభావంతో ఆనాటి విప్లవోద్యమ పరిస్థితిలో కామ్రేడ్ వెంకటరామయ్య అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళాడు. ఆ కాలంలో లో పోలీసులు దాడులు చేసేవారు. 1970లో ఇంటిమీద పెద్ద ఎత్తున పోలీసులు దాడి చేశారు. సోదాలు చేశారు ఇల్లు కాల పెట్టారు. ఆ పరిస్థితులలో వెంకట నరసమ్మ, తూముల రంగమ్మ సహకారంతో బండి కట్టించి గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ కి రహస్యంగా పంపించి ఖమ్మం పంపించారు.
వ్యవసాయం బందు చేసి ఇల్లు కాలపెట్టి ఉండనీయని పరిస్థితుల్లో, ఖమ్మంలో వడ్డానపు యాకయ్య సహకారంతో చిన్న బల్ల మీద పప్పు బెల్లాలు అమ్ముకుంటూ జీవించారు. 1977 చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని జీవించారు. ఎమర్జెన్సీ అనంతరం 1978 తర్వాత తిరిగి తమ పొలాన్ని తమను చేసుకో నివ్వాలని ఆనాడు పార్టీ ఇచ్చిన డైరెక్షన్ లో ప్రముఖ న్యాయవాదులు కె వి సుబ్బారావు ఖురేషీ లు కోర్టులో పిటిషన్ వేశారు . ఆనాటి పౌరహక్కుల నాయకుడు పత్తిపాటి వెంకటేశ్వరరావు ఆ కేసును డీల్ చేశారు . చివరకు ఆ ప్రాపర్టీని విభజించి వారి కుమారులు లు వ్యవసాయం చేసుకునేలా ఆర్డర్స్ ను తీసుకువచ్చారు కామ్రేడ్ వెంకట నరసమ్మ వెంకట రామయ్య జీవిత సహచరిగా అనేక కష్టనష్టాలను అనుభవించారు.వ్యవసాయాన్ని చేసుకోనీవ్వకపోయినా, ఇంటిని తగులబెట్టిన అత్యవసర పరిస్థితి కాలంలో రహస్యంగా ఉండవలసి వచ్చిన గుండె నిబ్బరంతో నిలబడ్డారు .అచంచల విశ్వాసాన్ని కనబరిచారు. తాను కూడా స్వయంగా పార్టీ కార్యక్రమాలలోనూ ప్రగతిశీల మహిళా సంఘం కార్యక్రమాలలోనూ క్రియాశీలకంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా ఒకే అద్దె ఇంట్లో వున్నారు.ఆ ఇంటి ఓనర్ ఒక రైతు.అగ్రహారం గ్రామం కు చెందినవారు.
పార్టీ కామ్రేడ్స్ పట్ల నాయకుల పట్ల వెంకట నర్సమ్మ గారు అత్యంత ఆప్యాయతను కనబరిచేవారు తెలంగాణ సాయుధ పోరాట కాలం నుండి నేటి ఉద్యమం వరకు అదే నిబద్ధతతో చివరి వరకు నిలబడడం అనేది ది విప్లవ శ్రేణులకు ఆదర్శనీయమైనది .వెంకట నరసమ్మ కుటుంబానికి సిపిఐ ఎం ఎల్ ప్రజా పంథా తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేససింది.
ReplyForward
|