కామ్రేడ్ సిద్ది వెంకటేశ్వర్లు ఘన నివాళులర్పించిన సిపిఐ నాయకులు
పినపాక నియోజకవర్గం ఆగష్టు 25 (జనం సాక్షి): రాష్ట్ర సిపిఐ మాజీ సహాయ కార్యదర్శి కామ్రేడ్ సిద్ది వెంకటేశ్వర్లు సంతాప సభను మణుగూరు పట్టణ మండల సిపిఐ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సంతాప కార్యక్రమంలో రాష్ట్ర సిపిఐ కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య చారి ఆయన చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపాన్ని తెలిపారు.ప్రజానాట్య మండలి కళాకారులు సురేందర్ రాము ఆధ్వర్యంలో సిద్ధి వెంకటేశ్వర్లు పేరుతో గేయాలను ఆలపించారు.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమ నుండే కమ్యూనిస్టు పార్టీ ఆకర్షితులై విద్యార్థి యువజన, రంగంలోనూ పార్టీలో కార్యవర్గ సభ్యులుగా, ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉంటూ ఈ జిల్లా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ,వారు ఎన్నో పోరాటాలకు ఉద్యమాలకు నాయకత్వం వహించారని, వారు చేసిన సేవలు అజరామరమని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. వారు కొనసాగించిన ఉద్యమ తీరుని పోరాటాలను గుర్తు చేసుకున్నారు.
అంగీతభావంతో, నీతి నిజాయితీ గల నాయకుడు సిద్ధి వెంకటేశ్వర్లని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీకి అనేక కార్యక్రమాలు రూపకల్పన చేశారని, ఆయన చాలా ఉత్తముడని, వారు మన మధ్య లేకపోవడం దురదృష్ట కరమని వారు చేసిన సేవలను పోరాటాలను స్ఫూర్తిగా ముందు తరాల వారికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు టిఆర్ఎస్ డిసిసిబి జిల్లా డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమం నుంచి అనేక కార్యక్రమాలు, పోరాటాలు నిర్వహించిన సిపిఐ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు సేవలు అజరామరo నీతి నిజాయితీ నిబద్ధతగల నాయకుడు వారి ఉద్యమాన్ని పోరాటాలను గుర్తు చేశారు అంకితభావంతో, నిజాయితీగల నాయకుడు సిద్ధి వెంకటేశ్వర్లుఅన్నారు
ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, పినపాక నియోజకవర్గం కార్యదర్శి సారెడ్డి పుల్లారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మీనారాయణ, సిపిఐ మండల పట్టణ కార్యదర్శి జంగం మోహన్ రావు ,దుర్గ్యాల సుధాకర్, ఏఐటీయూసీ మండల అధ్యక్ష కార్యదర్శులు తోట రమేష్ ,అక్కి నరసింహారావు, జిల్లా సమితి సభ్యులు ఎస్ కే సర్వర్, సోందే కుటుంబరావు ఎంపీటీసీ కామిశెట్టి రామారావు, ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్, నాయకులు మంగి వీరయ్య, బి వీరస్వామి ,జక్కుల రాజబాబు ఎస్వీ నాయుడు చింతల దశరథం, రావుల రాములు, కనితి సత్యనారాయణ, ఆటో యూనియన్ నుండి మల్లేష్, భద్రం, యాకయ్య ,బుచ్చి రాములు నునావత్ మంగమ్మ కోడిమల్ల సుజాత రాచకొండ సరోజిని బత్తు లక్ష్మయ్య, బోరిమెళ్ళ బాలస్వామి ,వీరయ్య తదితరులు పాల్గొన్నారు