కారు అద్దాల మార్పిడిపై పోలీసుల ప్రచారం
ఖమ్మం, నవంబర్ 3 : కార్ల నల్ల అద్దాల పిల్ములను తొలగించాలని ఇటీవల న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను పాటించాలని ట్రాఫిక్ పోలీసులు ప్రచారం చేపట్టారు. పలు కూడళ్లల్లో కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. కార్లు, జీపులు, తదితర వాహనాలకు సంబంధించిన కిటికి గ్లాసులను పారదర్శకంగా ఉంచాలని అన్నారు. వాహనాల లోపల కూర్చున వ్యక్తులు బయటకు కనిపించకుండా ఉండే నల్ల అద్దాలను తొలగించాలని ప్రచారం చేపట్టారు. నిబంధనలు అమలు చేయాలని జిల్లా పోలీసులు నిర్ణయించారు. అందులో భాగంగానే కార్ల యజమానులకు ముందుగా కరపత్రాలు పంపిణీ చేయాలని, నిబంధనలు పాటించని యజమానులపై కేసులు నమోదు చేయాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు.