కార్డన్‌ సర్చ్‌లో వాహనాలు స్వాధీనం

నిర్మల్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లాలోని లక్ష్మణచాంద మండలం వడ్యాలలో పోలీసులు సోమవారం ఉదయం కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ను చేపట్టారు. ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో 130 మంది పోలీసు సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలులేని 83 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అక్రమంగా నిల్వ ఉంచిన ట్రాక్టర్‌ లోడు కలపను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం పిప్పరవాడ టోల్‌ఎ/-లాజా వద్ద ఎస్‌ఎస్‌టీ బృందం వాహన తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా కారులో తరలిస్తున్న రూ. 4 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు.