కార్తి అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు

న్యూఢిల్లీ,నవంబర్‌1(జ‌నంసాక్షి): విదేశాలకు వెళ్లనున్న నేపథ్యంలో తన పిటిషన్‌పై విచారణ చేపట్టాలన్న కార్తి చిదంబరం అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విదేశాలకు వెళ్లడమనేది విషయమే కాదని దీంతో కేసు విచారణ త్వరితంగా చేపట్టడం సాధ్యంకాదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. నవంబర్‌ 3 నుండి విదేశీపర్యటన నిమిత్తం కార్తి ఇటలీ, ఆస్టియ్రా, బ్రిటన్‌లకు వెళ్లనున్నారు. దీంతో కోర్టు అంగీకారం కోసం ఆయన తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అయితే న్యాయమూర్తులందరూ వారు నిర్వహించాల్సిన వాటికన్నా ఎక్కువ విధులను కలిగి ఉన్నారని, దీంతో త్వరిత విచారణ చేపట్టడం కుదదరని పేర్కొంటూ పలు పిటిషన్‌లను శుక్రవారం చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌గొగోయ్‌ తిరస్కరించిన సంగతి తెలిసిందే. కాగా, కార్తి చిదంబరం సిబిఐ, ఇడిలనుండి ఐఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు.