కార్పొరేషన్ 60డివిజన్ రామన్నపేట లో మాల మహానాడు సభ జరిగింది
రఝునాధపాలెం జనం సాక్షి ఆక్తో బర్ 16 ఖమ్మం కార్పొరేషన్ 60డివిజన్ రామన్నపేట లో మాల మహానాడు సభ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాల మహానాడు సీనియర్ నాయకులు గుంతెటి వీరభద్రం హైకోర్టు న్యాయవాది పల్లా రాజశేఖర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ తదితర నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపట మనకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కొట్టే సుధాకర్ అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో మాలలు ఐక్యమత్యంతో ఉండాలని అన్ని రంగాలలో చైతన్యవంతులై అభివృద్ధిని సాధించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నిరంజన్ దాదే సతీష్ టీచర్ గుంతేటి వసంతరావు మాల మహానాడు జిల్లా నాయకులు కామా ప్రభాకర్ కాకాని రామారావు దాసరి శ్రీనివాస్ గాదిరి బాబు కుమ్మరి వీరబాబు పెద్దమాల మేడిపల్లి బాలశౌరి సలవాది జంగం కన్నయ్య తదితరులు పాల్గొన్నారు మాల మహానాడు అధ్యక్షులుగా జంగం శ్రీకాంత్ కార్యదర్శి జంగం కేశవులు నామ ఏసురత్నం జంగం నరసయ్య పిల్లి వెంకటేశ్వర్లు మరో ఐదుగురు కార్యవర్గ సభ్యులతో కమిటీని ఎన్నుకోవడం జరిగింది