కార్పోరేట్ కంపెనీల కోసమే కెసిఆర్ నిర్ణయాలు
సాగుచట్టాల రద్దుపై చర్చ సాగకుండా టిఆర్‌ఎస్ కుట్రలు
ఆదానీ, అంబానీలకు మేలుచేసే యత్నంలో కెసిఆర్
కెసిఆర్, మోడీల ఉమ్మడి వ్యూహంతో రైతులకు తీరని అన్యాయంవిూడియా సమావేశంలో మండిపడ్డ పిసిసి చీఫ్ రేవంత్‌న్యూఢల్లీి,నవంబర్30(జనం సాక్షి): ఆదానీ అంబానీలకు రైతులను దాసోహం చేసేందుకే సిఎం కెసిఆర్ ధాన్యం కొనుగోళ్లు చేయబోమని ప్రకటించారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. సిఎం కెసిఆర్, మోడీల ఉమ్మడి పథకంలో భాగంగానే కెసిఆర్ ధాన్యం కొనుగోళ్లను ఎత్తేస్తామని ప్రకటించారని అన్నారు. సాగుచట్టాలను రద్దు చేసిన రోజే సిఎం కార్పోరేట్ దిగ్గజాలకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించారని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతు సమస్యలపై మాట్లాడాలని కాంగ్రెస్ సహా విపక్షాలు భావించాయన్నారు. కానీ సభను అడ్డుకుని, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని రక్షించేందుకు టీఆర్‌ఎస్ ముందుకొచ్చిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ఆందోళనతో చర్చ లేకుండానే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ఉభయ సభలు పాస్ చేశాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచుతున్నాయని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ పంట అమ్ముకోలేక రైతులు ప్రాణాలు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో జరిగిన చీకటి ఒప్పందంలో భాగంగానే రైతు చట్టాల రద్దుపై.. చర్చ జరగకుండా టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో అడ్డుకున్నారని విమర్శించారు. వరి కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్ రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. నిజంగా రైతులపై చిత్తశుద్ధి ఉంటే, లోక్‌సభలో ఉన్న 9 మంది ఎంపీల్లోనే ముగ్గురు సభకు ఎందుకు రాలేదని అంటూ రేవంత్ ప్రశ్నించారు. వరేసుకున్న రైతులు ఉరేసుకునేలా రెండు పార్టీలు చేస్తున్నాయని మండి పడ్డారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు మేలు జరిగేలా చేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్టాల్రు ధాన్యం కొనకపోవడంతో రైతులు కార్పొరేట్ శక్తుల వైపు వెళ్లక తప్పని పరిస్థితి కల్పిస్తున్నాయన్నారు. దేశానికే అన్నపూర్ణ తెలంగాణ అని చెప్పిన సీఎం కేసీఆర్, వరి ధాన్యాన్నే కొనకుండా కూర్చున్నారని విమర్శించారు. వరితో పాటు ఏ పంటనూ కూడా కొనడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనడం లేదంటూ కేసీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్రం కొననప్పుడే కదా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాలన్నారు. దొంగలా దొరికారు కాబట్టే కేంద్ర ప్రభుత్వం మెడపై కత్తిపెట్టిందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ’మెడ విూద కత్తి’ అనే పదానికి అర్థం ఏంటో తెలంగాణ సమాజానికి చెప్పాలని కెసిఆర్‌ను రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులు పండిరచిన ధాన్యానికి కొననప్పుడు విూరు ముఖ్యమంత్రిగా ఉండే హక్కు విూకు ఉందా…? అంటూ కేసీఆర్ ను రేవంత్ ప్రశ్నించారు. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై విూకు అవగాహన ఉందా..? అంటూ నిలదీశారు. గతంలో రైతులు వరికి బదులు మొక్కజొన్న, చెరకు, పత్తి పండిస్తే పండిరచొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారన్నారు. పప్పు దినుసులు పండిస్తే వాటికి సరైన గిట్టుబాటు ధర లేకుండా చేశారన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసినప్పుడు వాటికి గిట్టుబాటు ధరతో పాటు రైతులకు సరైన వసతులు కల్పించాలన్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో ఒప్పందం కుదుర్చకున్నప్పుడు సీఎంకు తెలియదా…. అంటూ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం విఫలమైనప్పుడు సీఎం కేసీఆర్ అయినా రైతులను ఆదుకోవాలి కదా? అని అన్నారు. కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ సర్కార్ కనీసం ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని కూడా ప్రకటించలేదన్నారు. కేంద్రం కేసీఆర్ మెడపై కత్తి పెడితే.. ఆస్తులు, పదవులు మోదీకి రాసిస్తారా?… తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని.. కేంద్రం చెప్పినందుకే కేసీఆర్ రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అత్యంత అవినీతిపరుడని రేవంత్‌రెడ్డి విమర్శించారు.`