కార్పోరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలను కల్పిస్తూ ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యo.

తొర్రూర్:15:జూన్( జనంసాక్షి ) కార్పొరేట్ వసతి గృహాలకు దీటుగా ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయని ఆర్డిఓ రమేష్ బాబు అన్నారు. డివిజన్  కేంద్రంలో అమ్మపురం రోడ్డులో గల సమీకృత సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని తొర్రూరు మండలం లోని మున్సిపాలిటీ మరియు అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించడం జరిగింది. అనంతరం ఆర్డీవో రమేష్ బాబు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో ఏకైక మోడల్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ తొర్రూర్ లో నెలకొల్పడం ఎంతో ఆనందంగా ఉందని దీనిని పట్టణ మరియు గ్రామీణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ వసతి గృహంలో రెండు రకాలుగా అడ్మిషన్లు కల్పించడం జరుగుతుందని మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు 120 సీట్లు మరియు ఇంటర్మీడియట్ డిగ్రీ మరియు ఉన్నత విద్య చదివే విద్యార్థులకు 150 సీట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. కావున ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి సమీకృత వసతి గృహంలో విద్యార్థులను చేర్పించాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో తొర్రూరు ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, సోషల్ వెల్ఫేర్ ఏ డి నాగరాజు,తహసిల్దార్ రాఘవరెడ్డి,మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, తొర్రూర్ మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ సోమేశ్వర రావు, దళిత రత్న అవార్డు గ్రహీత గుండాల నరసయ్య, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.