కార్మికులకు జేఏసీ మోసం
సెంటినరికాలనీ, జూన్ 12, (జనంసాక్షి):
సకలజనుల సమ్మెలో పాల్గోన్న సింగరేణి కార్మి కులను తెలంగాణ జేఏసి మోసం చేసిందని… ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతా రామయ్య ఆరోపించారు. ఏఐటియుసి భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమ్మెలో భాగంగా కార్మికులకిచ్చిన రూ.25వేల అడ్వాన్స్‌ను రద్దు చేసే విషయంలో సదరు బాధ్యులు స్పష్టత ఇవ్వకపోవడంతో యాజమాన్యం ఏరియర్స్‌లో ఈ అడ్వాన్స్‌ను మినహాయించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు వైవి.రావు, మల్లారెడ్డి, జూపాక రాంచందర్, వేముల రాజేందర్, మల్లయ్య, గట్టయ్య, శ్రీనివాస్, సంజీవరావు, ఎస్‌ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు.