కార్మికుల సంఘం ఎన్నికలు నిర్వహించాలి

కాగజ్‌నగర్‌: సిర్‌పూర్‌ పేవరు మిల్లులో గుర్తింపు కార్మికుల సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు సహాయ కార్మికుల అధికారి కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల తేదీని ప్రకటించే వరకు అందోళన విరమించే ప్రసక్తే లేదని కార్మిక సంఘాల నాయకులు చెప్పారు.