కార్మిక చట్టాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం – ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అందె అశోక్
క
కొండపాక (జనంసాక్షి) జూన్ 11 : కార్మిక చట్టాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏఐటీయూసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు అందె అశోక్ అన్నారు. శనివారం వారు “జనంసాక్షి” తో మాట్లాడుతూ.. కార్మికులు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం 4కొడులుగా విభజించి కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేసి, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ చట్టం తీసుకురావాలని, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి రాష్ట్ర బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించాలన్నారు. 50సంవత్సరాలు నిండిన ప్రతీ కార్మికునికి 5వేల పింఛన్ ఇవ్వాలని, అర్హులైన కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, కార్మికులకు ప్రమాదం జరిగితే 10లక్షల భీమా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.