కార్మిక సంక్షేమానికి కట్టుబడ్డాం
– కేంద్రంలో కొలువుల జాతర
– దక్షిణాది రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రుల సమావేశంలో దత్తాత్రేయ
హైదరాబాద్,జూన్27(జనంసాక్షి):
కార్మికులకు ఉపాధి కల్పనే తమ లక్ష్యమని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కార్మిక సంక్షేమం కోసం అనేక చట్టా ల్లో మార్పులు తీసుకుని వస్తున్నామని అన్నారు. నగరంలోని ఖైరతాబాద్ ఆస్కిలో దక్షిణాది రా ష్ట్రాల కార్మికశాఖ మంత్రుల సమావేశం జరు గుతుంది. సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం కేం ద్రం పాటుపడుతున్నదన్నారు. తెలంగాణలో కార్మికుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయన్నారు. శ్రమయేవ జ యతే ద్వారా కార్మికులకు స్మార్ట్ కార్డులు ఇ చ్చాం. శ్రమ సువిధ పోర్టల్ ద్వారా కార్మికులకు యూనిక్ నెంబర్ కేటాయింపు చేపట్టామన్నారు. కార్మిక సంక్షేమం, ఉపాధి కల్పనే తమ లక్ష్య మని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో త్వరలో భారీగా ఉద్యోగ నియామకాలు జరుగు తాయన్నారు. కార్మిక కుటుంబాలకు అన్ని రకా లుగా తెలంగాణ ప్రభుత్వం బాసటగా నిలుస్తు న్నదని కార్మికశాఖ మంత్రి నాయిని నర్సిం హారెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాల కార్మికశాఖ మంత్రుల సదస్సులో పాల్గొన్న నాయిని మాట్లా డుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఈ సదస్సు జరు గుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. కార్మి కుల సంక్షేమంకోసం తీసుకుంటున్న చర్య లు అభినందనీయమన్నారు. తెలంగాణలో వేజ్ బోర్డును అమలు చేస్తున్నామని, . బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నా మని వివరించారు. సామాజిక భద్రతా చట్టాన్ని కట్టుదిట్టంగా అమలుచేస్తూనే పారిశ్రామిక రం బగానికి నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు. టీఎస్ ఐపాస్ ద్వారా పారిశ్రా మిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్నద న్నారు. నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఎన్నో పరిశ్రమలు తరలివస్తున్నయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకంతో కార్మిక లోకానికి ఎంతో ప్రయోజనకరంగా ఉం టుందని, చిన్న తరహా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఎంతో ఉపయోగ పడగలదని అ న్నారు. సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందంటూ బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకెళ్తున్నమని ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల కార్మికశాఖ మంత్రుల సమావేశం ఖైరతాబాద్ లోని అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ ఆఫ్ ఇండియా సంస్థలో జరుగుతున్నది. ఈ సమావేశానికి కేంద్ర, రాష్ట్ర కార్మికశాఖ మంత్రులు బండారు దత్తాత్రేయ, నాయిని నర్సింహారెడ్డిలతో పాటు ఏపీ, కేరళ, లక్షద్వీప్ రాష్ట్రాల కార్మికశాఖ మంత్రులు హాజరైయ్యారు. కార్మికుల సంక్షేమం, సంస్కరణలు, కార్మిక చట్టాలు, కనీసవేతనం వంటి తదితర అంశాలపై సమావేశంలో మంత్రులు చర్చిస్తున్నారు.