కార్యకర్తల కృషి మరువలేనిది
ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి: జోగు
ఆదిలాబాద్,జనవరి23(జనంసాక్షి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించేందుకు కృషిచేసినపార్టీ కార్యకర్తలను మాజతీమంత్రి, ఎమ్మెల్యే జోగురామన్న అభినందించారు.ఇదే స్ఫూర్తితో రాబోయే ఎం పీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, పార్లమెంట్ ఎన్నిక ల్లో కూడా టీఆర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో 90 శాతం పార్టీ బలపర్చిన అభ్యర్థులే గెలిచారని జోగురామన్న తెలిపారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి సంబురాలు చేసుకున్నారు. ఆదిలాబాద్ రూరల్, మావల మండలాల్లోని గెలిచిన పలువురు సర్పంచులు, వార్డు మెంబర్లు, టీఆర్ నాయకులు మంత్రి జోగు రామన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమాలలు వేసి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు కలుపుకొని 90 శాతం గ్రామాల్లో గులాబీ జెండా రెపరెపలాడిందన్నారు. ఈ ఫలితాలు సీఎం కేసీఆర్ పాలనకు గీటురాయిగా నిలుస్తాయన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పార్టీకి అఖండ విజయా న్ని చేకూర్చాయన్నారు. మరో రెండు విడతల్లో పార్టీ బలపరుస్తున్న సర్పంచు, వార్డు మెంబర్లను గెలిపించాల్సిందిగా కోరారు. కెసిఆర్ వచ్చాకే ఆసరా పింఛన్లు పెరిగాయని, అదేవిధంగా కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, రైతులకు రైతుబంధు పథకం, రైతుభీమా పథకాలను ప్రవేశపెట్టిందని అందరూ వీటిని ఉపయోగించు కోవాలన్నారు.