*కాలవ గండిని త్వరగా పూడ్చి నీటిని విడుదల చేయాలి*

– సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి బొంతు వెంకటేశ్వరరావు

మునగాల, సెప్టెంబర్ 19(జనంసాక్షి): నిడమనూరు మండలంలో సాగర్ కాలువకు గండిపడి పది రోజులు కావస్తున్న ఇంతవరకు గండిని పూడ్చే ప్రయత్నంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి బొంతు వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన మండలంలోని బరాఖత్ గూడెం గ్రామంలో గల పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, త్వరితగతిన గండిని పూడ్చి నీటిని విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు కవులు రైతులు సాగర్ నీటిని నమ్ముకుని లక్షల ఎకరాల్లో పంటలు వేసుకున్నారని, ప్రస్తుతం నీరు లేకపోవడం వలన పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.