కాలిన శవం గుర్తింపు

ఆదిలాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఉట్నూర్‌ మండలం ముతైకుంట చెరువు వద్ద కాలిపోయిన మృతదేహం గుర్తించారు. స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. ప్రమాదంపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహం నవోదయనగర్‌కు చెందిన రాథోడ్‌ గోకుల్‌ దిగా పోలీసులు గుర్తించారు. విచారణ చేపట్టిన పోలీసులు రాథోడ్‌ ది హత్యా? ఆత్మహత్యా? అనే

కోణంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.