కాలిఫోర్నియాలో గర్ల్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపిన వ్యక్తి
న్యూయార్క్: అమెరికాలో గర్ల్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపిన కేసులో 29 ఏళ్ల సిక్కు వ్యక్తిని అరెస్టు చేశారు. పార్కింగ్ గ్యారేజీలో అతను ఆమెను షూట్ చేశాడు. కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది. 34 ఏళ్ల మహిళను సిమ్రన్‌జిత్ సింగ్ కాల్చి చంపాడు. శనివారం ఉదయం ఇద్దరూ మాల్‌కు వచ్చారని, పార్కింగ్ గ్యారేజీలో ఉన్న మూడవ అంతస్తులో గర్ల్‌ఫ్రెండ్‌ను సిమ్రన్‌జిత్ షూట్ చేశాడని పోలీసులు తెలిపారు. గ్యారేజీలోనే గన్‌ను పడేసి అతను పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఓ స్టోర్ వద్ద ఉన్న సింగ్‌ను ఆ తర్వాత పోలీసులు పట్టుకున్నారు.