కాలువలో పడి తల్లి మృతి, బిడ్డ పరిస్థితి విషయం

ఖమ్మం జనంసాక్షి: ఖమ్మం అర్బన్‌ మండలం వి. వెంకాటాయపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ సోమవారం ఉదయం సాగర్‌ కాలువలో తల్లీ, బిడ్డ పడిపోయారు. ఈ సంఘటనలో తల్లి మృతి చెందగా, బిడ్డ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విశాఖలో నిలిచిపోయిన టీచర్స్‌ బదిలీలు విశాఖపట్నం, జనంసాక్షి: ఎన్‌ఎంసి హైస్కూల్‌లో టీచర్స్‌ బదిలీల కౌన్సెలింగ్‌లో గందరగోళం పరిస్థితి ఏర్పడింది. 8ఏళ్ల దాటి జీవీఎంసీలో ఉన్నవారిని విడిచిపెట్టారని గ్రామీణ టీచర్ల ఆందోళనకు దిగారు. బదిలీల్లో మంత్రి గంటా హస్తం  ఉందని వారు ఆరోపించారు. దాంతో టీచర్స్‌ బదిలీల కౌన్సెలింగ్‌ నిలిచిపోయింది.