కాల్పుల్లో 8 మంది మావోయిస్టులకు తీవ్రగాయాలు
ఖమ్మం: ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. నిమ్మలగూడెం అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులకు తీవ్రగాయాలైనట్లు సమాచారం.