కాళేశ్వరంతో తీరనున్న కష్టాలు: ఎమ్మెల్యే
జగిత్యాల,ఏప్రిల్20(జనంసాక్షి): తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెలిపారు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశానికే ఆదర్శమనీ, రివర్స్ పంపింగ్‌తో తెలంగాణ సస్యశ్యామలం కానుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాళేశ్వరం పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. తాను ఇటీవల రైతులతో కలసి నేరుగా పనులను వీక్షించానని అన్నారు. రైతులు దళారులను నమ్మి మోస పోవద్దని సూచించారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలు గకుండా ఉండేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. వచ్చే నెలలో రైతన్నకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు.