కాళేశ్వరంతో బంగారు తెలంగాణ సాధ్యం

నిజామాబాద్‌,జూలై7(జ‌నం సాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అద్భుతమని జిల్లాకు చెందిన పలువురు రైతులు అన్నారు. ఎంపి కవిత ప్రోత్సాహంతో పలువురు కాళేశ్రం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పూర్తి అయితే వ్యవసాయ రంగానికి ఎదురుండదని, కోటి ఎకరాల మాగాణాగా తెలంగాణ మారుతుందన్నారు. ప్రతీ ఎకరాకు గోదావరి జలాలు రావడం తథ్యమన్నారు. ప్రతిపక్షాలు ప్రాజెక్టుపై అనేక ఆరోపణలు చేసిన వాటిని తట్టుకొని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు కంటివిూద కునుకు లేకుంగా నిత్యం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పాటుపడుతున్నారన్నారు. ఇలాంటి కట్టడాన్ని ఎక్కడా చూడలేదని చెప్పారు. ఇప్పటికే రైతులు గోదావరి జలాలతో రెండు పంటలు పండించుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రాజెక్టు పూర్తి అయితే నియోజకవర్గం మరో కోనసీమగా మారడం ఖాయమన్నారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌ కలలుకంటున్న బంగారు తెలంగాణ కాళేశ్వరంతో సాధ్యమవుతుందన్నారు.