కాళేశ్వరంలో భక్తుల సందడి
కాళేశ్వరం,జూలై24(జనంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర క్షేత్రంలో సోమవారం ప్రత్యేక పూజలు ప్రారంభం అయ్యాయి. శివుడికి ఇష్టమైన సోమవారం కావడంతో భక్తులు పవిత్ర గోదావరిలో పుణ్యసన్నాలు ఆచరించి అభిషేకాలకు బారులు తీరారు. ఏకాదశి కావడంతో పాటు మంగళవారం ద్వాదశి రావడంతో భక్తుల రాక పెరిగింది. ఇలీవలి వర్షాలకు గోదావరిలో వరదనీరు చేరడంతో పర్యాటకులు ఉదయాన్నే స్నానాలు ఆచరించి పూజలు నిర్వహించారు. శుభప్రదమయిన రోజులు కావడంతో సుదూర ప్రాంత భక్తులు త్రివేణి సంగమ తీరంలో స్నానాలతో పులకించిపోయింది. ఆలయంలో ప్రత్యేక పూజలు
నిర్వహించారు. ఇకపోతే శ్రావణంలో రద్దీ మరింత పెరగగలదు. ఈ మాసంలో అనేక మంది భక్తులు క్షేత్రం చేరుకొని త్రివేణి సంగమతీరంలో పుణ్యస్నానాలు, దంపతి స్నానం, ఇసుకతో సైకిత లింగాన్ని తయారు చేయడం, కాళేశ్వర ముక్తీశ్వరస్వామి, ఆది ముక్తీశ్వర శుభానంద దేవి దర్శనం, పార్వతీ ఆలయంలో మంగళగౌరి వ్రతాలు, సరస్వతి అమ్మవారి సన్నిధిన అక్షర స్వీకారాలు, రాహుకేత కాలసర్పదోష పూజలు, ఏకాదశ లఘు రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన పూజలు, అష్తోత్తర శతనామావళి, శ్రావణ ¬మాలు తదితర పూజలతో అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. భక్తులు శ్రావణమాసంలో ప్రత్యేకంగా ఉపవాస దీక్షలతో, నిత్యం ఇక్కడికి వస్తుంటారు.నూతనంగా వివాహం అయిన వధువులు అమ్మ వారి ఆలయంలో మంగళ గౌరీ వ్రతాలు నిర్వహించడం జరుగుతంది. శ్రావణ మాసంలోని నాలుగు మంగళవారాల్లో శుభానంద దేవికి కుంకుమార్చనలు నిర్వహిస్తారు. శివునికి అత్యంత ప్రీతికరమైన లక్ష బిల్వార్చన పూజలను భక్తులు శ్రావణమాసంలో నిర్వహిస్తుంటారు. ఈ మాసంలో అటవీ ప్రాంతంలో విరివిగా మారేడు బిల్వ పత్రి లభించడం అందుకు విశేషం. అర్చకులచే కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి బిల్వదళ పూజలు నిర్వహించి భక్తులను అర్చకస్వాములు ఆశీర్వదిస్తారు. ఆలయానికి సవిూపంలో ఉన్న గుండం చెరువులో శ్రావణ మాసంలోనే విరివిగా కమలం పుష్పాలు లభించడంతో భక్తులు యుమునికి, శివునికి కమలాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.