కాళోజి జీవితం తెలంగాణ జాతికే స్ఫూర్తి దాయకం…

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అజీజ్ బేగ్

కేసముద్రం సెప్టెంబర్ 9 జనం సాక్షి /శుక్రవారం రోజున మండల కేంద్రంలో కాళోజి జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం ను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించి కాళోజి చిత్ర పటానికి పూల మాల వేసి వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ అజీజ్ బేగ్ మాట్లాడుతూ
కాళోజి జీవితం తెలంగాణ జాతికే స్ఫూర్తి దాయకం అని,
నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు,పద్మవిభూషణ్‌,తెలంగాణ తొలి పొద్దు కాళోజీ నారాయణరావు అని , ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని అన్నారు.తెలుగు అధ్యాపకులు ప్రసాద్ , పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు క్రిష్ణ ప్రసాద్ మాట్లాడుతూ…
విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పట్ల ఆకర్శితులై ఆర్య సమాజ్‌,
సత్యాగ్రహం, గ్రంథాలయ ఉద్యమంతోపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం
పౌర హక్కుల సాధన వంటి పలు ఉద్యమాల్లో
కీలకపాత్ర పోషించారు.కాళోజి గారి మాటలు పుట్టుక నీది ,చావు నీది జీవితమంతా దేశానిది అనే మాటలు సమాజానికి స్ఫూర్తి దాయకమని అన్నారు.తెలంగాణ ఉద్యమంలో కాళోజి గారి మాటలు తూటాలుగా పని చేసాయి.ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతం లోనే పాతిపెడుదాం, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం వరకు తరుముదాం అనే మాట తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా ఉపయోగించే వారని గుర్తుచేశారు.అనంతరం స్వయం పరిపాలన దినోత్సవం లో ఉత్తమంగా బోధించిన విద్యార్థులు బిందు,ప్రశాంతి,రాజేశ్వరి లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ,సంతోష్,క్రిష్ణ ప్రసాద్ ,కొమ్మాలు,వీరన్న,బ�