కావూరి ని సన్మానించిన శ్రామిక శక్తి యూనియన్.

– కంపెనీ అభివృద్ధి కి అహర్నిశలు కృషి..

– బాధ్యతకు-భరోసా అంటే కావూరి…

– ఐటీసీ లో కావూరి సేవలు మరువలేనివి.

– సన్మాన కార్యక్రమంలో ఉన్నతాధికారుల ప్రశంసలు…

బూర్గుంపహాడ్ సెప్టెంబరు30 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గుంపహాడ్ మండలం సారపాక ఐటీసీ పరిశ్రమ లో ముప్పై ఐదు సంవత్సరాలుగా వివిధ విభాగాల్లో విశిష్ట సేవలందించి శుక్రవారం ఉద్యోగ విరమణ పొందిన సీనియర్ కార్మికుడు కావూరి హనుమంతురావు ని ఐటీసీ శ్రామిక శక్తి ఎంప్లాయిస్ అండ్ బదిలీస్ యూనియన్ టిఆర్ఎస్ కేవీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి వివిధ కార్మిక సంఘాల నాయుకులు, కార్మికులు పెద్ద ఎత్తున హాజరై వారికి పూల బొకేలు అందించి శాలువాతో సత్కరించి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పలువురు అధికారులు, కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఆయన ఒక బాధ్యతగా, భరోసా గా వ్యహరిస్తూ ఎంతటి రిస్క్ ఎదురైన తనదైన శైలిలో అట్టి ప్రాబ్లమ్స్ ను అధికమించి ముందుకెళ్లేవారని కొనియాడారు. ప్రతి ఒక్క కార్మికుడు హనుమంతరావు ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అనంతరం సానికొమ్ము శంకర్ రెడ్డి మాట్లాడుతూ ఒక కాంట్రాక్ట్ కార్మికుడిగా ప్రస్థానం మొదలైన ప్రయాణం ఎంతో మందికి తనకు తెలిసిన పనిని పదిమందికి చెప్తూ ధైర్యాన్ని నింపారని అన్నారు. కంపెనీ అభివృద్ధికి, యూనియన్లు అభివృద్ధి అహర్నిశలు కృషి చేశారని, వారి ఉద్యోగ విరమణ శేషజీవితం ఆనందంగా, సంతోషంగా భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆశీస్సులతో హాయిగా గడపాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో హరినాథ్, రవి కుమార్, గోపాల్, దయాకర్, రామిరెడ్డి, అంతయ్య, సతీష్ యాదవ్, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.