కాశ్మీర్‌పై ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
ప్రకటన చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్
వాషింగ్టన్,జూలై23(జనంసాక్షి): కశ్మీర్ సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోలేమని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. వివాదాస్పద కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను పాక్ ప్రధాని స్వాగతించారు. అమెరికా వెళ్లిన ఇమ్రాన్.. అక్కడ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఆ సందర్భంలో కశ్మీర్ సమస్య గురించి మోదీ తనతో మాట్లాడారని, మధ్యవర్తిత్వం వహిస్తే
బాగుంటుందని కోరారని ట్రంప్ అన్నారు. దీంతో ఇది సంచలనంగా మారింది. కశ్మీర్ సమస్యపై ఓ సందర్భంలో జనరల్ పర్వేజ్ ముష్రరఫ్, ప్రధాని వాజ్‌పేయి తీర్మానం చేసేందుకు అంగీకరించారని, కానీ ఆ తర్వాత రెండు దేశాలు దూరం దూరంగా ఉన్నాయని ఇమ్రాన్ అన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారంలో అమెరికా పెద్ద పాత్ర పోషిస్తుందని, ట్రంప్ పాత్ర మరీ విశేషంగా ఉంటుందని ఇమ్రాన్ తెలిపారు. 130 కోట్ల మందికి సంబంధించిన అంశాన్ని చర్చిస్తున్నామని, ఒకవేళ శాంతి కుదిరితే ఆ లాభాలే మరోలా ఉంటాయని ఇమ్రాన్ అన్నారు. భారత్ తన అణ్వాయుధ సవిూకరణ నిలిపివేస్తే.. తాము కూడా ఆపేస్తామని ఇమ్రాన్ చెప్పారు. రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరుగదని, అది స్వంత ధ్వంసమే అవుతుందన్నారు. స్వాతంత్యం/-ర వచ్చి 70 ఏళ్లు అవుతున్నా.. కశ్మీర్ సమస్య వల్ల నిజమైన నాగరికులుగా ఉండలేక పోతున్నామన్నారు.