కాశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నయి

– కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌

శ్రీనగర్‌,సెప్టెంబర్‌ 11,(జనంసాక్షి): కశ్మీర్‌లో రోజు రోజుకూ పరిస్థితి మెరుగుపడుతుందని.. శాంతి స్థాపనే లక్ష్యమని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. కశ్మీర్‌లో శాంతి స్థాపనే తమ లక్ష్యమని రాజ్‌నాథ్‌ ఉద్ఘాటించారు. కశ్మీర్‌లో ఉన్న సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్న రాజ్‌నాథ్‌.. ఎవరితోనైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం.. సలహాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్న రాజ్‌నాథ్‌ విూడియాతో మాట్లాడారు. ఇక్కడ పరిస్థితి పూర్తిగా చక్కబడుతుందని తాను అననని,అయితే గతం కన్నా పరిస్థితి మెరుగుపడుతోందని విశ్వాసంగా చెప్పగలను అని పేర్కొన్నారు. కశ్మీర్‌లోని ప్రతి యువకుడు, యువతి ముఖంపై చిరునవ్వు, సంతోషం చూడాలనేదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. కశ్మీర్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం గురించి తాము మాట్లాడుతున్నామని తెలిపారు. అవసరమనుకుంటే.. కశ్మీర్‌లో సంవత్సరానికి 50 సార్లు పర్యటిస్తానని ¬ంమంత్రి చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు కేంద్రం భారీ ప్యాకేజ్‌ ఇస్తోందని కూడా రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ప్రధాని డవలప్‌మెంట్‌ ప్యాకేజీ (పీఎండీపీ) లక్ష కోట్ల రూపాయలు దాటినట్టు ఆయన తెలిపారు. ఈ ప్యాకేజీ కింద ఇంతవరకూ రూ.62,599 కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పీఎండీపీ ప్రాజెక్టు అమలులో ప్రగతిని ఇక్కడ జరిగిన సమావేశంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ సవిూక్షించారు. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌ సింగ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీపీ వ్యాస్‌, ఆయన మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు శ్రీనగర్‌లో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్‌ ప్రజలకు తాను పూర్తి భరోసా ఇస్తున్నానని, అవసరమైతే ఏడాదిలో 50 సార్లు ఇక్కడకు రమ్మన్నా వస్తానని అన్నారు. రాష్ట్రంలో శాంతి, అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే తమ ముందున్న లక్ష్యమని రాజ్‌నాథ్‌ విస్పష్టంగా ప్రకటించారు. కారుణ్యం, కమ్యూనికేషన్‌, సహజీవనం, విశ్వాసం పాదుకొలపడం, నిలకడైన విధానాల ద్వారానే కశ్మీర్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. చర్చల ద్వారానే కశ్మీర్‌ సమస్య పరిష్కారం సాధ్యమని ప్రధాని మోదీ స్వాతంత్య దినోత్సవ ప్రసంగంలోనూ స్పష్టం చేసిన విషయాన్ని రాజ్‌నాథ్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కశ్మీర్‌లోయలో పరిస్థితి మెరుగుపడిందని, ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్నదే తమ అభిమతమని చెప్పారు. ఆర్టికల్‌ 35ఏ గురించి ¬ం మంత్రి ప్రస్తావిస్తూ, జమ్మూకశ్మీర్‌ ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఎలాంటి చర్యలను కేంద్ర తీసుకోదని చెప్పారు.