కాశ్మీర్‌లో విరిగిపడుతున్న కొండచరియలు

శ్రీనగర్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. శ్రీనగర్‌-జమ్మూ జాతీయ రహదారిని మూసివేశారు. రాంబన్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడంతో.. హైవేను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో కూడా పరిస్థితి అదుపు తప్పింది. షిమ్లా జిల్లాలోని కుట్‌, కుండీ, కుంచా గ్రామాల్లో.. వరదల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. రోడ్లు, బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయాయి. ఇండో టిబెట్‌ బోర్డర్‌ పోలీసులు.. ఓ పాక్షిక బ్రిడ్జ్‌ను పునర్‌ నిర్మించారు. అయితే ఆబ్రిడ్జ్‌ మళ్లీ కురిసిన వర్షాలకు ధ్వంసం అయ్యింది.