కాశ్మీర్‌ ప్రజలు శాంతి కోరుకుంటున్నారు

C

– ముఫ్తీతో కలిసి మీడియాతో రాజ్‌నాథ్‌

శ్రీనగర్‌,ఆగస్టు 25(జనంసాక్షి): కాశ్మీర్‌లో శాంతి నెలకొనాలని యావత్‌ దేశం కోరుకుంటోందిన, ఇక్కడి ప్రజలు ఆకాంక్ష కూడా అదేనని  కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. అయితే పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల ఇక్కడ శాంతిని విచ్చిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.  కాశ్మీర్‌ పర్యటనకు వచ్చిన రాజ్‌నాథ్‌ జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులపై ఇరువురు చర్చించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాజ్‌నాథ్‌ సింగ్‌ జమ్మూ కశ్మీర్‌ వెళ్లిన విషయం తెలిసిందే. రాజ్‌నాథ్‌, ముఫ్తీ భేటీ అనంతరం ఇరువురు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ విూడియాతో మాట్లాడుతూ.. వేర్పాటువాదుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 95 శాతం మంది కశ్మీరీలు శాంతిని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తాను నెల రోజుల్లో రెండుసార్లు కశ్మీర్‌లో పర్యటించానన్నారు. శాంతి విషయమై అనిన పార్టీలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలో అఖిలపక్ష బృందం కశ్మీర్‌ను సందర్శిస్తుందని తెలిపారు. కాగా, బుర్హన్‌ వని ఎన్‌కౌంటర్‌ తర్వాత గత 48 రోజులుగా కశ్మీర్‌లో కర్ఫ్యూ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దీంతో పరిస్థితులను ఆయన సవిూక్షించారు.  జమ్మూకశ్మీర్‌లో శాంతియుత వాతావరణం కోసం కృషి చేస్తున్నట్లు కేంద్ర ¬ంశాఖ స్పష్టం చేశారు.  కశ్మీర్‌లో చోటుచేసుకున్న తాజా పరిస్థితులపై ఇరువురు చర్చించారు. కశ్మీర్‌ అల్లర్లకు కారణమైన వారికోసం అన్వేషణ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. యువతను తప్పుదోవ పట్టిస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. కశ్మీర్‌ యువత చేతుల్లో ఉండాల్సింది రాళ్లు, మారణా యుధాలు కాదని.. పుస్తకాలు, కలాలు, కంప్యూటర్లు ఉండాలన్నారు. దేశ భవిష్యత్తు కశ్మీర్‌తోనే ముడిపడి ఉందని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. కాగా కశ్మీర్‌ అల్లర్లపై జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నిప్పులు చెరిగారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బుధవారం శ్రీనగర్‌ చేరుకున్న విషయం తెలిసిందే.సంయుక్త విూడియా సమావేశంలో పాల్గొన్న మెహబూబా మాట్లాడుతూ ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. 95 శాతం మంది కశ్మీరులు శాంతిని కోరుకుంటున్నారని, కేవలం ఐదు శాతం మందే హింసకు పాల్పడుతున్నారని అన్నారు. 2010 నాటి షోపియాన్‌ అల్లర్లతో ప్రస్తుత అల్లర్లను పోల్చడం సరికాదన్నారు. అప్పటి అల్లర్లకు కారణం ఉందన్నారు. షోపియాన్‌కు చెందిన ఇద్దరు మహిళలపై సెక్యూరిటీ సిబ్బంది అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి మధ్య ఎంతో తేడా ఉందని సీఎం అన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు నిప్పు పెట్టిన వ్యక్తిని కాల్చడం, నిరసన తెలుపుతూ పాలు తెచ్చుకునేందుకు వెళ్తున్న వ్యక్తిని కాల్చడం మధ్య చాలా తేడా ఉంది అన్నారు. జూలై నుంచి జరుగుతున్న అల్లర్లలో పాలుపంచుకుంటున్న వారు ఐదు శాతం మంది మాత్రమేనని, వారంతా జాతి వ్యతిరేకులని పేర్కొన్నారు. వారి ఆందోళన చట్టబద్ధం కాదన్నారు. చర్చలు కోరుకునే వారు, యువకులను రాళ్లు పట్టుకుని కోరే వారి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందని వివరించారు.  జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాది బుర్హన్‌ వని ఎన్‌కౌంటర్‌ అనంతరం కశ్మీర్‌ లోయలో ఏర్పడిన ఆందోళన పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. గురువారం  48వ రోజు కూడా పోలీసులు కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాలు సహా అనంత్‌నాగ్‌ పట్టణం, పుల్వామా జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. సెప్టెంబర్‌ 1 వరకు లోయ బంద్‌కు వేర్పాటువాదులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బుర్హన్‌ వని ఎన్‌కౌంటర్‌ తర్వాత జరిగిన ఆందోళనల్లో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 66కు చేరింది. వెయ్యి మందికిపైగా క్షతగాత్రులయ్యారు. మరోవైపు రాజ్‌నాథ్‌ పర్యటన సందర్భంగా గట్టి భద్రత ఏర్పాటు చేశారు.