కాశ్మీర్ విషయంలో కఠినంగా ఉండాల్సిందే
పాక్ పన్నాగాలను తిప్పికొట్టాల్సిందే
న్యూఢల్లీి,ఏప్రిల్13(జనంసాక్షి): పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద మూకలు కొన్నేళ్లుగా భారత వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ముష్కర మూకలు మరోమారు ప్రజలు, భద్రతా బలగాలు లక్ష్యంగా కాల్పులకు తెగగబడుతున్నారు. ఇటీవలి వరుస ఘటనలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. వారికి అక్కడి పాలకులు పాలుపోసి పెంచుతున్నారు. కళ్లముందే ఉగ్రవాదులు చెలరేగుతున్నా పాక్ ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరించడం చూస్తుంటే వారిని ఎంతప్రేమగా చూసుకుంటుందో గమనించవచ్చు. వారిని కట్టడి చేయడానికి ఏ దశలోనూ ప్రయత్నించిన పాపాన ఆ దేశ పాలకులు పోవడంలేదు. కాశ్మీర్‌లో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడ నిత్యం జరుగుతన్న దాడుల కారణంగా సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. సామాన్యులు లక్ష్యంగా కాల్పులు జరిపి ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించాల న్నది పాక్ పన్నాగంగా ఉన్నది. ప్రజల రక్షణ కోసం భారత్ సైన్యం ఉగ్రవాద శిబిరాలపై దాడులకు దిగి గట్టి బుద్ది చెప్పాల్సి వచ్చింది. అయితే ఈ వ్యవహారంతో పాక్ వైఖరిలో మార్పు కించిత్తు కూడా కానరావడం లేదు. మాటలు, బెదిరింపుల,హెచ్చరికలు, సర్జికల్ దాడుల స్థాయి దాటిందని మన పాలకులు గుర్తించాలి. సర్జికల్ దాడుల తరవాత ఏదో రకంగా భారత్‌తో వైరం పెంచుకుని ఉగ్రవాదులను ఎగదోస్తోంది. భారత్ సరిహద్దుల్లో, కాశ్మీర్‌లో అల్లర్లు రేపడం, దాడులకు పాల్పడేలా రెచ్చగొట్టడం నిత్యకృత్యం చేసుకుంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ వెన్నులో వణుకు పుట్టించా లంటే నిజానికి లక్షిత దాడుల తరవాత మళ్లీ దాడులు చేయాల్సి ఉంటే బాగుండేదని రక్షణ నిపుణులు అంటున్నారు. ఉగ్రమూకలను నిరోధించేలా చేస్తే బాగుండేది. కేవలం ఒక్కదాడితో దానికి బుద్ది రాలేదని గుర్తించాలి. అయితే సర్జికల్ దాడులు మినహా
మరో ప్రత్యామ్నాయం భారత్ ముందు లేకుండా పోయింది. అందుకు వెనకాడమని పదేపదే కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ చెబుతున్నా కాశ్మీర్ విషయంలో లోతుగా ఆలోచన చేయాల్సి ఉంది.