కివీస్ గెలిచినా తిరుగులేనిది భారత్, పాక్‌పై హండ్రెడ్ పర్సెంట్: లీగ్
హైదరాబాద్: ప్రపంచ కప్ 2015 లీగ్ ముగిసింది. లీగ్‌లో ఎన్నో మరుపురాని మ్యాచ్‌లను చూశాం. చిన్న జట్లే కదా అనుకుంటే.. పెద్ద జట్లకు ముచ్చెమటలు పోయించాయి. టోర్నీలో ఆకట్టుకున్నాయి. పెద్ద జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్‌లు సాగాయి. అందులో కొన్ని… ప్రపంచ కప్ గ్రూప్ దశలో తిరుగులేని ప్రదర్శన భారత జట్టుదే. గ్రూప్ ఏలో న్యూజిలాండ్ ఆరు మ్యాచ్‌లలో ఆరు విజయాలు సాధించిందినప్పటికీ.. ఆస్ట్రేలియా పైన అతి కష్టం మీద నెగ్గింది. స్కాట్లాండ్, బంగ్లాదేశ్‌ల పైన నెగ్గడానికి కష్టపడింది. ఐదు మ్యాచులలో ప్రత్యర్థులను ఆలౌట్ చేసినప్పటికీ.. ఓ మ్యాచ్‌లో ఆలౌట్ చేయలేకపోయింది. భారత జట్టు మాత్రం ఆరు మ్యాచుల్లో ప్రత్యర్థులను ఆలౌట్ చేసింది. తద్వారా ఆరు మ్యాచుల్లో అరవై వికెట్లు తీసి రికార్డ్ సృష్టించింది. అంతేకాదు, పాకిస్తాన్, సౌతాఫ్రికాల పైన గెలుపుతో రికార్డ్ సృష్టించింది. పాకిస్తాన్‌తో ప్రపంచకప్‌లో భారత్ ఇప్పటి వరకు ఓడలేదు. దానిని కొనసాగించింది. కివీస్ గెలిచినా తిరుగులేనిది భారత్, పాక్‌పై హండ్రెట్ పర్సెంట మరోవైపు, సౌతాఫ్రికా పైన భారత్ ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో నెగ్గలేదు. ఆ చరిత్రను తిరగరాసింది. వెస్టిండీస్, జింబాబ్వేల పైన కాస్త కష్టపడి గెలిచింది. భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శన చేసింది. ప్రపంచకప్ తొలిసారి ఆడుతున్న ఆప్ఘనిస్తాన్.. తన కంటే అనుభవమున్న స్కాట్లాండ్‌ను ఓడించింది. వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. కివీస్ బౌలర్ల ధాటికి ఆస్ట్ర్లేలియో 151 పరుగులకు ఆలౌటైంది. మెకల్లమ్ మెరుపులతో కివీస్ 8 ఓవర్లకే 78 పరుగులు చేసింది. దీంతో ఆ మ్యాచ్ ఏకపక్షమవుతుందనుకున్నారు. కానీ ఆ తర్వాత స్టార్క్ తన అద్భుత ప్రదర్శనతో మలుపు తిప్పాడు. ఆరు వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బతీశాడు. 146/9తో ఉన్న సమయాన.. విలియమ్సన్ సిక్సర్ బాది కివీస్‌ను గెలిపించాడు. భారత్ తరఫున శిఖర్ ధావన్ సెంచరీలు చేయడంతో పాటు దూకుడుగా ఆడుతున్నాడు. సంగక్కర నాలుగు సెంచరీలు చేసి ఎన్నో రికార్డ్‌లు సృష్టించాడు. క్రిస్ గేల్ (215) ఏకంగా ప్రపంచకప్‌లోనే డబుల్ సెంచరీ కొట్టిన రికార్డ్ సృష్టించాడు. ఇక వెస్టిండీస్ పైన డివిలియర్స్ విధ్వంసకర మ్యాచ్ ఆడాడు. చివరి 2 ఓవర్లలో (వెస్టీండీస్ సారథి వేసిన బౌలింగు) ఏకంగా 62 రన్స్ చేశాడు. బౌలర్లు కూడా ఆకట్టుకున్నారు. కివీస్ టిమ్ సోథీ ఇంగ్లాండుతో జరిగిన మ్యాచులో ఏడు వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ పైన ఆసీస్ పేసర్ 6 వికెట్లు తీశాడు. ఇక, చిన్న జట్లు ఆకట్టుకున్నాయి. ఐర్లాండ్ చిన్నజట్లలో అందరికంటే ఎక్కువ ఆకట్టుకుంది. ఓ దశలో అది క్వార్టర్ చేరుకుంటుందని భావించారు. మరికొన్ని ఆసక్తికర విషయాలు… లీగ్ దశలో ఆరుకు ఆరు మ్యాచ్‌లు గెలిచిన జట్లు భారత్, న్యూజిలాండ్. యూఏఈ, స్కాట్లాండ్ జట్లు ఒక్క విజయం సాధించకుండానే ప్రపంచకప్ నుండి నిష్క్రమించాయి. నాలుగు ఆసియా జట్లు ప్రపంచకప్ క్వార్టర్లోకి రావడం ఇదే మొదటిసారి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాయి. 1996లో భారత్, పాకిస్తాన్, శ్రీలంకలు క్వార్టర్‌కు వచ్చాయి. నాలుగు జట్లు మాత్రం ఇప్పటి వరకు రాలేదు. లీగ్ దశలో 35 సెంచరీలు నమోదయ్యాయి. శ్రీలంక అత్యధికంగా ఎనిమిది సెంచరీలు నమోదు చేసింది. సెంచరీ చేయని జట్టు ఆప్ఘనిస్తాన్. నాలుగువందలు లేదా అంతకంటె ఎక్కువ స్కోర్ ఈసారి మూడుసార్లు చేశారు. సౌతాఫ్రికా ఐర్లాండ్, వెస్టిండీస్‌ల పైన 400 కంటే ఎక్కువ పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఆప్ఘనిస్తాన్ పైన 417 పరుగులు చేసింది. లీగ్‌లో ఓ జట్టు చేసిన అత్యధిక తక్కువ స్కోర్.. 102. యూఐఈ జట్టు భారత్ పైన చేసింది. తక్కువ మార్జిన్‌తో గెలుపు.. ఐర్లాండ్ జట్టుది. అది జింబాబ్వే పైన ఐదు పరుగుల తేడాతో గెలిచింది. అత్యధిక పరుగులను చేధించిన జట్టు.. బంగ్లాదేశ్. స్కాట్లాండ్ (319) భారీ లక్షాయ్నన్ని చేధించింది. ప్రపంచకప్ చరిత్రలో క్రిస్ గేల్ (215) తొలిసారి డబుల్ సెంచరీ చేశాడు. తొలిసారి ప్రపంచ కప్‌లో పాల్గొన్న ఆప్ఘనిస్తాన్.. స్కాట్లాండ్ పైన గెలిచింది. శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్‌ల పైన సెంచరీలు సాధించాడు. గ్రూప్ దశలో అత్యధిక పరుగుల జాబితాలో సంగక్కర ఫస్ట్ ఉన్నాడు. అతను ఆరు ఇన్నింగ్స్‌ల్లో 496 పరుగులు చేశాడు. యావరేజ్ 124గా ఉంది. బౌలింగులో న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సోథీ ఇంగ్లాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసు 33 పరుగులు ఇచ్చాడు. ఎక్కువ వికెట్లు తీసింది మిచెల్ స్టార్క్. అతను ఐదు ఇన్నింగ్స్‌లలో 16 వికెట్లు తీశాడు. వర్షం కారణంగా ఆగిన మ్యాచ్ ఒకటి. ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్. చెరో పాయింట్ పంచుకున్నాయి. సౌతాఫ్రికాకు చెందిన ఆటగాడు డివిల్లీర్స్ ఎక్కువ సిక్స్‌లు కొట్టాడు. అతను ఇరవై సిక్స్‌లు కొట్టాడు. సంగక్కర ఎక్కువ ఫోర్లు కొట్టాడు. అతను 54 ఫోర్లు కొట్టాడు. జింబాబ్వేకు చెందిన సీన్ విలియమ్స్, పాకిస్తాన్‌కు చెందిన మిస్బా ఉల్ హక్‌లు చెరో నాలుగు హాఫ్ సెంచరీలు చేశారు. ఎక్కువ మెయిడెన్ ఓవర్లు వేసింది.. న్యూజిలాండ్ ట్రెంట్ బౌల్ట్ (11 ఓవర్లు) ఈ ప్రపంచ కప్ లీగ్‌లో ఒక హ్యాట్రిక్ మాత్రమే నమోదయింది. ఇంగ్లాండ్‌కు చెందిన ఫిన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఒకే ప్రపంచ కప్‌లో రెండు సెంచరీలు చేసిన భారత క్రికెటర్లు.. సచిన్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీలు. వారి సరసన ఇప్పుడు శిఖర్ ధావన్ చేరాడు. పాకిస్తాన్ పైన భారత్ ఇప్పటి వరకు ప్రపంచకప్ మ్యాచ్‌లలో ఓడలేదు. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ప్రపంచకప్‌లో ఆరుసార్లు తలపడగా.. ఆరుసార్లు భారత్ గెలిచింది. ఇది హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్. ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్.. నాలుగు ఇన్నింగ్సులలో అతనిది 190.37. పాకిస్తాన్‌కు చెందిన ఉమర్ అక్మల్ ఐదు క్యాచ్‌లు పట్టాడు. వికెట్ కీపర్‌గా ఈ ప్రపంచకప్‌లో ఇదే అత్యధికం.