కిశోర బాలికల ర్యాలీ

పోషకాలు అందితేనే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

మహాదేవపూర్సెప్టెంబర్ 8 (జనంసాక్షి)

 

మహదేవపూర్ మండల కేంద్రంలో అంగన్వాడీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు పౌష్టికాహారం తోనే ఆరోగ్యంగా ఉంటారని సరియైన పోషకాలు అందిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుందని మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతి బాపు అన్నారు. గురువారం నాడు పోషణ అభిమాన్ కార్యక్రమంలో భాగంగా కిషోర బాలికలతో పంచాయితీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు.మహాదేవపూర్ మండల కేంద్రంలో అంగన్వాడీలు “పోషణ్ అభియాన్” మాసోత్సవాల కిషోర బాలికలతో ర్యాలీ నిర్వహించారు.
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో నెల రోజులపాటు పోషణ్ అభియాన్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని.తెలిపారు.ఆహారంలో పోషకవిలువలు లోపిస్తే,పిల్లల శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండదని, రక్తహీనత(ఎనిమియా) లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని,మహిళా శిశు ఆరోగ్య వికాసం సరిగ్గా ఉండదని, ఆకుకూరల్లో అన్ని రకాల పోషకాలు.లభిస్తాయని ఆహారం ద్వారా సరియైన పోషకాలు అందితేనే జ్ఞాపక శక్తి పెరుగుతుందని,ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణిస్తారని సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు.పూర్వ కాలంలో మట్టి పాత్రలో వండిన ఆహారాన్ని ,పెరట్లో ప్రకృతి సేద్యంతో పండిన కూరగాయలను తినేవారని ఆయన గుర్తు చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం. కోట్ల కొలది సంపదతో సమానమని,పౌష్టికాహారం అందరికీ అందాలన్నదే ఉత్సవాల ఉద్దేశ్యం అని జడ్పీటీసీ గుడాల అరుణ అన్నారు. సరియైన పోషకాలు గ్రహించి అన్ని రకాల పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని అంగన్వాడీ టీచర్ సత్యవాణి, సుజాత అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రజినీకాంత్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు,ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.