కిషన్‌జీది సర్కారీ హత్య
– మమత బెనర్జీ మేనల్లుడు
19 జూలై (జనంసాక్షి) :
మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీది ముమ్మాటికీ సర్కారీ హత్యేనని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత మేనల్లుడే ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చిక్కుల్లో పడ్డారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా బెల్పహారి జిల్లాలో జరిగిన బహిరంగసభలో అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ, కిషన్ జీని చంపడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని నిరూపించుకుందని అన్నారు.
2011లో అక్టోబర్ నెలలో బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలోని బురిసోల్ గ్రామం సవిూపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ మరణించారని ఇంతకాలం మమతా బెనర్జీ ప్రభుత్వం వాదిస్తోంది. ఆయన ఎన్‌కౌంటర్‌కు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మమతా వాదిస్తూ వచ్చారు. అయితే, అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో కిషన్ జీ హత్య మరోమారు వార్తలకెక్కింది.