కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుల నియామకం – కాంగ్రెస్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి

జనం సాక్షి మంథని : ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు సూచన మేరకు, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ , పెద్దపల్లి మాజీ ఎంఎల్ఎ విజయరమణరావు ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాలకు కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులను నియమించినట్లు కిసాన్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆల్ల సుమన్ రెడ్డి – ఓదల, పన్నాల రాములు – సుల్తానాబాద్, సిరికొండ కొమురయ్య – జూలపల్లి, గోపు లక్ష్మా రెడ్డి – ఎలిగేడు, బద్దం నర్సింహరెడ్డి – ధర్మారం, నర్ర సత్తయ్య – పాలకుర్తి, గాదం శ్రీనివాస్ – ముత్తారం(మంథని), ఎం.తిరుపతి – అంతర్గాం, నెత్తెట్ల కుమార్ – పెద్దపల్లి, బొల్లాల సంతోష్ – పెద్దపల్లి మండలాల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఇట్టి నియామకము తక్షణమే అమలులో అమలులోకి వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంటు, కిసాన్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటు, రైతుల సమస్యలపై పోరాటం చేస్తు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి ఈ సందర్భంగా వారికి సూచించారు.