కుంటలోకి కారు… తప్పిన పెను ప్రమాదం..

శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 12
కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామంలో ఓ కారు కుంటలోకి ప్రమాదవశాత్తు దూసుకుపోయిన ఘటన బుధవారం జరిగింది. గ్రామస్తులు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం పెద్ద పల్లి జిల్లా, పెద్దపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లో ఏఈగా విధులు నిర్వహిస్తున్న వంగల వెంకటనారాయణ (56) అనే వ్యక్తి టీఎస్ 22 హెచ్ 2777 నంబర్ గల కారులో వరంగల్ వైపుకు వెళుతుండగా మార్గమధ్యంలోని కొత్తగట్టు గ్రామం శివారులో జాతీయ రహదారి ప్రక్కన ఉన్న సాయి కుంటలోకి ప్రమాదవశాత్తు కారు దూసుకుపోయిన ఘటన జరిగిందని, వెంటనే గ్రామస్తులు చేరుకొని బ్లూ కోర్టు పోలీసులకు సమాచారం అందించడంతో, బ్లూ కోర్టు పోలీసులు కుమార్, సదయ్య, చేరుకొని వెంకట నారాయణ ను క్షేమంగా బయటికి, గ్రామస్తులతో కలిసి బ్లూ కోర్టు పోలీసులు చేసిన సేవలకు, కుమార్, సదయ్యకు వెంకటనారాయణ కృతజ్ఞతలు తెలిపారు, సేవలందించిన బ్లూ కోర్టు పోలీసులను, గ్రామస్తులు, ప్రయాణికులు అభినందించారు.