కుంభకోణాలపై ప్రధాని నోరువిప్పరెందుకు?

2

న్యూఢిల్లీ, జులై23(జనంసాక్షి):

లలిత్‌ మోదీ, వ్యాపం కుంభకోణంపై ప్రధాని మోడీ నోరు విప్పరేందుకని  కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల వేళప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆయన సూటిగా విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని మౌనం వీడి సమాధానం చెప్పాలన్నారు. సుష్మా స్వరాజ్‌ లలిత్‌ మోదీకి సహకరించారని ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయిందని రాహుల్‌ గాంధీ విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు మోడీ ఏమి చెప్పారు?ఇప్పుడు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అవినీతిరహిత పాలన అంటే ఇదేనా అని ఆయన అన్నారు. లలిత్‌ మోడీ గేట్‌ లో సుష్మ స్వరాజ్‌ తో ఎందుకు రాజీనామా చేయించలేదని ఆయన ప్రశ్నించారు. అసలు మోడీ వీటిపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన అన్నారు. ప్రజాసమస్యల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఆయన మండిపడ్డారు. మోడీ బిజెపికి మాత్రమే ప్రధాని కాదని,దేశానికి అంతటికి ప్రధాని అన్న సంగతి గుర్తుంచుకోవాలని రాహుల్‌ అన్నారు.