కుంభమేళా స్థాయిలో పుష్కరాలు

5

-నెలాఖరుకు పనులు పూర్తి

-మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

హైదరాబాద్‌,13 జూన్‌ (జనంసాక్షి)

గోదావరి పుష్కరాలు కుంభమేళా స్థాయిలో నిర్వహిస్తామని,  పనులను ఈ నెలాఖరుకల్లా పూర్తిచేసి, జూన్‌ 30లోగా పుష్కరాల ఏర్పాట్లు పూర్తిచేస్తామని  తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పుష్కరాలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీలను ఆహ్వానిస్తామని  తెలిపారు. పుష్కరాల కోసం తెలంగాణలో 106 పుష్కరఘాట్లు నిర్మించినట్టు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 65 పుష్కర ఘాట్లు పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన పనులన్నీ జూన్‌ 30లోగా పూర్తి చేస్తామన్నారు. ఈనెల 21, 22 తేదీల్లో ఏర్పాట్లను అధికారుల బృందం పరిశీలిస్తుందని మంత్రి పేర్కొన్నారు.  జులై 14న ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు  దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ తెలిపారు. పుష్కరాల పనులను ఈనెల 30 కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణపై ఆయన శనివారం సచివాలయంలో అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులతో పాటు మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల

నాగేశ్వరరావు హాజరయ్యారు. సవిూక్ష అనంతరం మంత్రి  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పుష్కరాల నిర్వహణకు వివిధ జిల్లాల్లో ఐఏఎస్‌ అధికారులను ఇంఛార్జులుగా నియమించినట్లు చెప్పారు.పుష్కరాల నాటికి వర్షాలు పడి, గోదావరిలో నీరు రాకుంటే  నీరు ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామని పేర్కొన్నారు.  ఇప్పటివరకు గోదావరిలో నీరు రాకపోవడంతో పుష్కరాల నాటికి ఏంటన్న ఆందోళన కూడా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పుష్కరాల నిర్వహణ కోసం నిధుల కేటాయింపులో వివక్ష చూపించిందని, కేవలం రూ. కోట్లే మంజూరు చేసి, ఏపీకీ అధిక నిధులు ఇచ్చిందన్నారు.  పుష్కరాలు జరిగే ప్రదేశాల్లో ఈనెల 21, 22 తేదీల్లో ఇంఛార్జులు, జిల్లా కలెక్టర్లు పర్యటిస్తారని తెలిపారు. పుష్కరాల కోసం 1700 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, బాసర, భద్రాచలం, మంచిర్యాలకు రైళ్లు నడిచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పుష్కర ప్రాంతాలకు వెళ్లేందుకు హెలిక్టాపర్‌ ద్వారా సేవలు అందిస్తామన్నారు. భద్రాచలం, మంచిర్యాల ఘాట్లకు చినజీయర్‌స్వామి వెళ్తారని, పుష్కరాల్లో ఆయన 50వేల మందికి అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. కేందప్రభుత్వం పుష్కరాల నిర్వహణ కోసం తెలంగాణకు రూ.50 కోట్లే ఇచ్చి, ఆంధ్రప్రదేశ్‌కు అధికమొత్తంలో నిధులు ఇచ్చిందన్నారు. నిధుల్లో వ్యత్యాసంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు తెలిపామని, ఆయన తప్పకుండా న్యాయం చేస్తామని హావిూ ఇచ్చినట్లు చెప్పారు.

పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం 1700 ప్రతేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, భద్రాచలం, బాసర, మంచిర్యాల ఘాట్లకు ట్రైన్లు నడిచేలా ఏర్పాటు చేస్తామన్నారు.