కుదురుకున్న భారత్ మిడిలార్డర్
రెండోరోజు టెస్ట్‌లో 4 వికెట్ల నష్టానికి 308 పరుగులు
311 పరుగలకు ఆలౌట్ అయిన విండీస్
హైదరాబాద్,అక్టోబర్13(జనంసాక్షి): భారత్-విండీస్ మధ్య ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ లోకేశ్ రాహుల్ 4 పరుగులకే అవుటైనప్పటికీ, యువ సంచలనం పృథ్వీషా మరోమారు వీరవిహారం చేశాడు. తొలి టెస్టు దూకుడును కొనసాగించాడు. 53 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 70 పరుగులు చేసి వారికన్ బౌలింగ్‌లో హెట్‌మయెర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చతేశ్వర్ పుజారా 10, కెప్టెన్ విరాట్ కోహ్లీ 45 పరుగులు చేసి ఔటయ్యారు. అజింక్య రహానే 75, రిషబ్ పంత్ 85 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు 295/7 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన విండీస్ మరో 16 పరుగులు జోడించి మూడు వికెట్లు కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టాడు. 88 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకున్నాడు. విండీస్ ఆల్ రౌండర్ రోస్టన్ చేజ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ జాసన్ ¬ల్డర్ 52 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. తొలుత రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయి టీమిండియాను కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన రహానె, పంత్ కుదురుగా ఆడుతూ.. అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత స్కోరు 200 మైలురాయి చేరింది. టాప్ ఆర్డర్ విఫలమైనా వీరిద్దరూ విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 139 పరుగుల భారీ భాగస్వామ్యంతో భారత్ ను మెరుగైన స్థితిలో నిలిపారు. క్రీజులో రహానె(71; 162 బంతుల్లో, రిషబ్ పంత్(83; 105బంతుల్లో, ఆడుతున్నారు. ప్రస్తుతం 77 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది.