కుల దురహంకార హత్యలను ఖండించాలి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): కుల దురహంకార హత్యలను ఖండించాలని కోరుతూ గురువారం జిల్లా కేంద్రంలోని రైతు బజార్ లో గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థి సంఘాలు, దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో కుల వ్యవస్థ దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు , గిరిజన శక్తి రాష్ట్ర నాయకులు వెంకటేష్ నాయక్ , టీవివి జిల్లా అధ్యక్షులు గుండాల సందీప్ , జన సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు తగుళ్ళ జనార్దన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రోజురోజుకు కుల దురహంకార హత్యలు  జరుగుతున్నాయని, ఇలాంటి  కుల దురహంకార హత్యలను  ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.మంథని మధుకర్, ప్రణయ్ మొదలుకొని నిఖిల్ హత్యల వరకు ప్రధాన కారణమైన కుల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.నిఖిల్ హత్య జరిగి ఐదు రోజులు గడిచినా కారకులెవరో తేల్చకపోవడం సరికాదన్నారు.తక్షణమే విచారణ జరిపి లా విద్యార్థి నిఖిల్ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.నిఖిల్ కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమానికి సంఘీభావంగా సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, బీఎస్పీ  జిల్లా కార్యదర్శి దాసరి శ్రీను , నాయకులు చెరుకుపల్లి లక్ష్మణ్, కుల నిర్మూలన వేదిక నాయకులు అశోక్ , మరిపల్లి సురేష్ , పల్లెటి రమేష్ , సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area