కుల వివక్షకు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడండి

గంగారం సెప్టెంబర్ 23 (జనం సాక్షి)
సెప్టెంబర్ 24 నుండి 30 వరకు గ్రామ గ్రామాన ప్రచార ఉద్యమాన్ని జరపండి. పార్టీ శ్రేణులకు సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడ గంగారం మండలాల కమిటీ పిలుపు.
ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న పుల్లన్న.
భారతదేశంలో కుల వ్యవస్థ వేల సంవత్సరాల నుండి ఉంటూ వస్తున్నది. అది నిమ్మ కులాలకు అమానుష పీడనకు అన్సివేతకు దోపిడికి గురిచేస్తుంది. కుల వ్యవస్థ కింది నుండి పై వరకు వివిధ పద్ధతుల్లో స్థాయిలలో అంతరాలను ఏర్పాటు చేసింది. భారతదేశం ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశం లో ఒకటిగా చెప్పబడుతుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు దాటింది.
జ్యోతిరావు పూలే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం సాగించాడు
బ్రాహ్మణయ్య భావజాలానికి వ్యతిరేకంగానూ. లో భాగంగా పురాణాలు మీద గ్రంథాలను దేవుళ్లను తీవ్రంగా విమర్శించాడు. మత గ్రంధాలు ప్రవక్త కళ ఉపదేశాలపై ఆధారపడే మతాన్ని తీవ్రంగా వ్యతిరేకించి నీతి నియమాలపై ఆధారపడే మతాన్ని అనుసరించాలని అన్ని కులాలలోని ప్రజలు చైతన్యవంతులైనప్పుడే కుల వ్యవస్థ నిర్మూలన జరుగుతుందని భావించాడు.
ఈ లక్ష్య సాధన కొరకు 1873 వ సంవత్సరంలో సత్యశోధకు సమాజ్ అనే సంస్థను స్థాపించాడు. సంస్థలో కులాన్ని వ్యతిరేకించే వారందరూ చేరుటకు అవకాశం కల్పించాడు.
1854లోనే అస్వస్థుల కోక పాఠశాల నేర్పించాడు దళితులు మహిళలలో విద్యా వ్యాప్తి కొరకు పాఠశాల ఏర్పాటు చేసి స్వయంగా తాను తన భార్య సావిత్రిబాయి ఉపాధ్యాయులుగా పని చేశారు. జ్యోతిరావు పూలే గొప్ప సాంఘిక సంస్కర్త కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జీవితాంతం రాజులేని పోరాటం సాగించాడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల నాయకులు జీవన్. సాంబరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.