కువైట్‌లో ఉగ్రపంజా

2

– 13 మంది మృతి

– ట్యునీషియా 27 మంది

– సిరియా, ఫ్రాన్స్‌లో దాడులు

న్యూఢిల్లీ,26 జూన్‌ (జనంసాక్షి):

కువైట్‌,ప్రాన్స్‌లలో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు దాడిరకి తెగబడ్డారు. కువైట్‌లోని ఓ మసీదులో ఆత్మాహతి శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. రంజాన్‌ మాసం సందర్భంగా నగరంలోని షియా వర్గానికి చెందిన మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో 13 మంది పౌరులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా… వారిని సవిూపంలోని ఆస్పత్రికి తరలించారు. .రంజాన్‌ మాసం ,శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున ముస్లింలు ప్రార్దనలకు వచ్చిన సమయంలో ఈ పేలుళ్లు జరగడం తీవ్ర ఆందోళన కలిగించింది. షియాలు ఎక్కువగా హాజరయ్యే ఈ ప్రార్దనా మందిరంలో పేలుళ్ల ద్వారా షియా, సున్నీ వర్గాల మద్య విభేదాలు పెంచడానికిగాను  ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టారని భావిస్తున్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇక ఆగ్నేయ ఫ్రాన్స్‌ లయోన్‌ నగరం సవిూపంలోని గ్రెనోబుల్‌లో ఉన్న ఓ గ్యాస్‌ ఫ్యాక్టరీపై ఐఎస్‌ఐఎస్‌ సంస్థకు చెందిన ఉగ్రవాది దాడికి పాల్పడ్డాడు. కారులో వేగంగా వచ్చిన ఉగ్రవాది నేరుగా ఫ్యాక్టరీలోకి దూసుకుపోయాడు. ఫ్యాక్టరీలో అతను విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మృత్యువాత పడగా, పలువురు గాయపడ్డారు. అంతేకాకుండా కారులో వెళ్తూ పలు చోట్ల పేలుడు పదార్థాలు ఉంచాడని స్థానిక విూడియా తెలిపింది. ఫ్యాక్టరీపై ఉగ్రవాది ఐఎస్‌ఐఎస్‌ జెండాను కూడా ఎగురవేశాడని పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం పది గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఉగ్రవాది కర్మాగారంలో చొరబడ్డాడన్న వార్తలతో అప్రమత్తమయిన ఫ్రాన్స్‌ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అతడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. పోలీసులు అతడిని తీసుకెళ్లే క్రమంలో ఆ ఫ్యాక్టరీ గేటుపై అరబిక్‌ అక్షరాల్లో అతడు ఏదో రాసి వెళ్లాడని స్థానిక విూడియా తెలిపింది. పత్రిక కార్యాలయంపై ఉగ్రదాడులు జరిగిన సరిగ్గా ఆరు నెలల తరువాత ఈ ఘటన జరగడంతో ఫ్రాన్స్‌ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. అధికారులు పరిస్థితుల్ని సవిూక్షిస్తున్నారు.

టునీషియాలో..

టునీషియాలో ఉగ్రవాదులు రెండు పర్యాటక ¬టళ్లతో పాటు, సమీపంలోని బీచ్‌లో తుపాకులతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 27 మంది మృతి చెందినట్లు సమాచారం. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం… మృతుల్లో విదేశీయులు సైతం ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల కలకలంతో బీచ్‌లో సేదతీరుతున్న వారు, ¬టళ్లలో ఉన్నవారంతా భయాందోళనలకు గురయ్యారు. భద్రతాదళాలు ఓ ఉగ్రవాదిని కాల్చిచంపాయి. టునీషియా అంతర్గత వ్యవహారాలశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఉగ్రవాది బీచ్‌లో కాల్పులకు తెగబడటంతో అక్కడికక్కడే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.