కూటమి నేతలను నమ్మవద్దు
తెలంగాణ అభివృద్ది కెసిఆర్‌తోనే సాధ్యం: కొప్పుల
ధర్మపురి,నవబంర్28(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచే విధంగా కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని,వాటిని అడ్డుకుని టిఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని ధర్మపురి టిఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ప్రజలు కూటమి నేతలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రరాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఇస్తున్నారని అన్నారు. బాబు సూచనలు, సలహాలు చేయడంతో పాటు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలన్నింటినీ కలుపుకొని మహాకూటమి పేరుతో కుట్రలు పన్నుతూ అభివృద్ధి నిరోధకులుగా మారేందుకు ఎన్నికల పూట ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారన్నారు.
రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని కూడగట్టుకోవాలనే ఉద్దేశంతో శత్రువులుగా ఉన్న పార్టీలు సైతం మిత్రులుగా మారి మహాకూటమి పేరుతో జతకట్టారని అన్నారు. ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ సారథ్యంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకే ఓటు వేసి పట్టం కట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా రూపొందించడమే టీఆర్‌ఎస్ పార్టీ ధ్యేయమని పేర్కొ న్నారు. పేరుతో ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతు న్నాయని పేర్కొన్నారు. స్వరాష్ట్రం కోసం తెలంగాణ ఉదమం చేస్తున్న సందర్భంలో ఆనాటి ప్రభుత్వాలైన కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు ఉద్యమం చేస్తున్న కార్యకర్తలను, నాయకులను హేళన చేసేవారన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వం లో 13ఏళ్ల పాటు ఉద్యమాన్ని కొనసాగించి సీ మాంధ్రులు, ఢిల్లీ పెద్దలకు ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ వాణిని వినిపించి స్వరాష్ట్రం
సాధించామన్నారు. నీళ్లు, విద్యుత్, సంక్షేమ పథకాలే ధ్యేయంగా పనిచేశామన్నారు. గతంలో లేని కరెంట్ స్వరాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ హయాం లో 24 గంటల పాటు సరఫరా చేస్తున్న విద్యుత్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో రాష్ట్ర ప్రజలే ఆలోచించాలన్నారు. ఆనాటి ప్రభుత్వాలు విద్యుత్‌ను వారి స్వలాభం కోసం వాడుకున్నారన్నారు. రానున్న కాలంలో గోదావరి, కృష్ణా నది జలాలను ఒడిసి పట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటిని అందజేసేందుకు గానూ ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు.