కూరగాయల ధరలతో రైతుల దిగాలు

అనంతపురం,జూలై11(జనం సాక్షి) ):వేలకు వేలు పెట్టుబడి పెట్టి పండిరచిన పంటలకు గిట్టుబాటు ధరలు పడిపోతుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ముఖ్యంగా కూరగాయల ధరలు నేల చూపు చూస్తుండటంతో వాటిని పండిరచిన రైతుల గుండెల్లో గుబులు రేగుతోంది. కొద్దిరోజుల క్రితం ఆకాశాన్ని అంటిన టమోటా, మిరప, బెండ, చిక్కుడు తదితర పంటలు ప్రస్తుతం నేలచూపు చూస్తున్నాయి. వాటిని పండిరచిన రైతులకు మాత్రం పెట్టుబడి కూడా చేతికి అందక ఆందోళన చెందుతున్నారు. రైతులు ఏ పంట సాగుచేయాలన్నా ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50వేలు పైనే ఖర్చు వస్తోంది. రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో వీటిని పండిరచిన రైతులకు మాత్రం పెట్టుబడి కూడా అందలేదు. సరైన ధర లభించిక నష్టపోతున్నారు. వాటిని రోజువారి అవసరాలకు కొంటున్న వినయోగదారులకు మాత్రం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటు రైతుకు నష్టమే అటు వినియోగదారునికి నష్టమే. మధ్యలో దళారులు మాత్రం అధిక ధరలకు అమ్ముతూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు