కూర్చుని మాట్లాడుకోండి..హోం మంత్రి రాజ్‌నాథ్‌

2
న్యూదిల్లీ,మే20(జనంసాక్షి): దిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం విషయంలో చెలరేగిన వివాదం తారస్థాయికి చేరింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘాటుగా లేఖ రాశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తన ప్రభుత్వాన్ని తమ పనేదో తమను చేసుకోనివ్వాలని అందులో కోరారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ ద్వారా ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని నడిపించాలని కేంద్రం భావిస్తోందని ఆయన ఆరోపించారు. నజీబ్‌ జంగ్‌ పదే పదే తమ ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి అరవింద్‌ కేజీవ్రాల్‌, ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి పరిణామంలోనే ఆయన మోదీకి లేఖ రాశారు. ఇదిలావుంటే కేజ్రీకి బీహార్‌ సిఎం నితీష్‌ మద్దతు పలికారు. అయితే ఈ వ్యవహారంపై రాజ్‌నాథ్‌ స్పందించారు. దిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌, ముఖ్యమంత్రి కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ సూచించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌, లెప్టినెంట్‌ గరవ్నర్‌ నజీబ్‌ జంగ్‌ల మధ్య తలెత్తిన వివాదం విషయమై చర్చించేందుకు రాజ్‌నాథ్‌సింగ్‌, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిశారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ… ఇద్దరూ చర్చించుకుంటేనే సమస్య పరిష్కారమవుతుందన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కు మధ్య కొనసాగుతున్న వివాదాన్ని చర్చించుకొని, సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో సమావేశమైన రాజ్‌ నాథ్‌ ఢిల్లీ వివాదంపై ప్రెసిడెంట్‌ తో చర్చించలేదన్నారు. అయినా ఢిల్లీ సర్కారు, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కలిసి చర్చించుకొని వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తో పాటూ కేంద్రాన్ని విమర్శిస్తూ ప్రధానికి కేజ్రీవాల్‌ రాసిన లేఖ గురించి స్పందించేందుకు రాజ్‌ నాథ్‌ నిరాకరించారు.