కూలిపోయిన విమానప్రమాదంలో విమానశకలాలు, మృతదేహాలు

gp0inj4y హైదరాబాద్‌ : ఫ్రాన్స్‌ దక్షిణ ప్రాంతంలోని ఆల్ప్స్‌ పర్వతశ్రేణిలో కూలిపోయిన విమానప్రమాదంలో శకలాలు, మృతదేహాలను తీసుకువచ్చేందుకు సహాయచర్యలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగా కొద్దిసేపు సహాయకచర్యలను ఆపివేసిన విషయం తెలిసిందే. విమానం కూలిపోయిన ప్రాంతం పర్వతప్రాంతంలో కావడంతో వందలమీటర్ల మేర విమానశకలాలు, మృతదేహాలు పడివున్నట్టు గుర్తించారు.
–  కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్న సహాయక బృందాలు పారిస్‌కు తరలించాయి. సీవీఆర్‌ చాలావరకు దెబ్బతినివుందని అయితే డేటా సేకరించడం కష్టతరం కాబోదని ఫ్రాన్స్‌ అధికార వర్గాలు తెలిపాయి.
– విమాన ప్రమాదం ఎలా జరిగివుంటుందన్న అంశంపై అనేక సందేహాలు నెలకొన్నాయి.
– 38 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం కేవలం ఎనిమిది నిమిషాల్లో ఆరువేల అడుగుల కిందకు ఎందుకు వచ్చింది.?
– విమానం కిందకు వచ్చేటప్పుడు ఎలాంటి పొగలు కానీ విస్ఫోటనం కానీ సంభవించలేదని ప్రత్యక్షసాక్షులు పేర్కొన్నారు.
– సీవీఆర్‌ రికార్డర్‌ లభ్యమైనప్పటికీ ఫ్లయిట్‌ డేటా రికార్డర్‌ ఇంకా దొరకలేదు. ఇది దొరికితే విమాన ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం వెలుగుచూసే అవకాశముంది.
-ప్రమాదం జరిగే ముందు పైలట్‌ నుంచి ఎలాంటి ఎమర్జెన్సీ కాల్‌ రాలేదు.
– విమానం కూలిన సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని అయితే ఆ శబ్దాన్ని అవలాంచి (మంచుతుపాను) అనుకున్నామని స్థానికులు తెలిపారు.
– విమానం ఆరువేల అడుగుల కిందకు రాగానే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి.
– విమానం కూలిన ప్రదేశం ఎత్తైన పర్వతాలతో వున్న ప్రాంతం. ఇక్కడ పర్వతాల ఎత్తు సగటు ఎత్తు మూడు వేల మీటర్లు
-దీంతో అత్యంత సుక్షితులైన సహాయబృందాలను రంగంలోకి దించారు.
నవ్వుతూ వెళ్లారు… శాశ్వతంగా దూరమయ్యారు…

సాంస్కృతిక మార్పిడిలో భాగంగా స్పెయిన్‌కు నవ్వుతూ వెళ్లిన విద్యార్థులు 16మంది, ఇద్దరు ఉపాధ్యాయులు విమాన ప్రమాదంలో మృతిచెందడంతో జర్మనీ హాల్టెర్న్‌లోని జోసెఫ్‌ కోనింగ్‌ జిమ్నాజియం పాఠశాల శోకంలో మునిగిపోయింది. తమ నగరంలో కూడా ఇలాంటి విషాదం ఎప్పుడూ జరగలేదని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు. ప్రమాదంలో మృతిచెందిన ఒక ఉపాధ్యాయునికి ఆరునెలల క్రితమే వివాహమైందని ఆయన తెలిపారు. విద్యార్థులకు నివాళి అర్పించిన కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు, అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
విమాన ప్రమాద ప్రదేశానికి జర్మనీ ఛాన్సలర్‌

ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్‌ పర్వతశ్రేణుల్లో విమానం కూలిపోయిన ప్రదేశానికి జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ చేరుకున్నారు. ఆమెతో పాటు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు  లాండె వున్నారు. అనంతరం స్పెయిన్‌ ప్రధాని మారియనొ రాజెయో కూడా అక్కడకు విచ్చేశారు. విమాన ప్రమాద మృతులకు ముగ్గురు నేతలు నివాళులర్పించనున్నారు.