కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి.
దౌల్తాబాద్ అక్టోబర్ 11, జనం సాక్షి.
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్క టిఆర్ఎస్వి కార్యకర్త కృషి చేయాలని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.నల్గొండ జిల్లా మునుగోడు బై ఎలక్షన్ల నేపథ్యంలో టిఆర్ఎస్వి ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్గొండ ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతుంటే ఆ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించిందన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల సంక్షేమం కోసం పాటుపడిందని నేటి వరకు కూడా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు.టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించేందుకు ప్రతి ఒక్క టిఆర్ఎస్వి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు సాంబారపు నాగరాజు, సోషల్ మీడియా కన్వీనర్ భానుప్రసాద్, టిఆర్ఎస్వి నాయకులు అంగడి జలంధర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area