కృష్ణవేణి స్కూల్ లో అట్టహాసంగా ముందస్తు బతుకమ్మ ఉత్సవాలు

జనంసాక్షి, రామగిరి, అక్టోబర్ 13 : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శుక్రవారం అట్టహసంగా ముందస్తు మన కృష్ణవేణి బతుకమ్మ ఉత్సవాలను విద్యాసంస్థల కరస్పాండెంట్ చందుపట్ల తిరుపతి రెడ్డి , ప్రధానోపాధ్యాయులు బర్ల. శ్రీనివాస్ లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆనంతరం వారు మాట్లాడుతూ.. ప్రపంచానికి మన తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పిన పండుగ “బతుకమ్మ” అని గుర్తుచేస్తూ, ప్రతి ఒక్కరు సంస్కృతి, సాంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటించాలని, ఉత్తమంగా వ్యవహరించాలని తెలిపారు. బొడ్డమ్మ ఆరంభం నాటి నుండి మహా అష్టమి వరకు బతుకమ్మ ఆటను ఆకాశమే హద్దుగా అన్నట్టు వివిధ రకాల జానపద గేయాలు, ప్రకృతి పులకరించే పాటలతో చూడచక్కగా వేడుకలను జరుపుకుంటారని, ఊరూ, వాడ అని తేడా లేదనుకుండ రెట్టింపు ఉత్సాహంతో పండుగను వైభవోపేతంగా నిర్వహించుకుంటారని అన్నారు. సమాజం లో ఐక్యత, ప్రేమ అనురాగాన్ని ఆవిష్కరించే పండుగ ఇదేనని తెలుపుతూ ప్రకృతి ఒడిలో దొరికేటువంటి వివిధ రకాల పూలతో అందంగా అలంకరించి, గౌరీమాత కృపను పొందుతారన్నారు. బతకమ్మకు అత్యంత ప్రీతికరమైనటు వంటి గౌరీమాతను గుమ్మడి పూలతో తయారు చేసి ఆ అమ్మవారి కృపను వారి పరివారానికి నిలుపు కుంటారని తెలియజేస్తూ బతుకమ్మ పండుగ ద్వారా ప్రేమ, అనురాగం చాలా వెల్లివిరిస్తూందని వారు చెప్పారు. ఎనిమిది రోజుల బతుకమ్మ వివిధ రకాల ప్రసాదాలతో ఆరాధించి అమ్మ వారి ఆశీస్సులను అధికంగా ఉండేలా చేస్తారని, ప్రత్యేకంగా అమ్మవారి శరన్నవరాత్రులు అత్యంత భక్తి, శ్రద్ధలతో నియమ,నిష్టలతో కఠినంగా ఉపవాసాలను పాఠించి పూజా కైంకర్యాలను నిర్వహిస్తారని, అమ్మవారిని పది రోజులలో పది అవతారాలలో సుందరంగా అలంకరించి, అమ్మవారిని సపరివారంగా సుహాసినిలందరు సుందరంగా ప్రతిష్ఠాపనకు మరియు ఆశిర్వచనానికి అట్టహాసంగా శ్రీలలిత సహస్ర నామ పారాయణ ద్వారా ఆహ్వానించి పూజా కార్యక్రమాలను చాలా గొప్పగా నిర్వహిస్తారని తెలిపారు. సుమారు 400 మంది విద్యార్థినులు సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి పాఠశాలలో పండుగ వాతావ ర్ణాన్ని రెట్టింపు చేశారు. అదే విధంగా సుమారు 50 పైగా బతుకమ్మలను విద్యార్థులు వివిధ రూపాల్లో తయారుచేసి వారి ఆనందాన్ని కొలాట ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ శ్రీధర్ బాబు, అనిల్ కుమార్ రెడ్డి, రంజిత్ రెడ్డి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.