కృష్ణా ట్రైబ్యునల్‌పై 13న సుప్రీంలో విచారణ
న్యూఢల్లీి,నవంబర్29((జనం సాక్షి): కృష్టా ట్రైబ్యునల్ అంశంపై దాఖలైన పిటిషన్లపై డిసెంబర్ 13న సుప్రీం కోర్టు విచారణ జరుపనున్నది. కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్ తుది నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వ అధికారిక గెజిట్‌లో ప్రచురించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం విచారణ జరిపింది. ఈ కేసులో ప్రతి స్పందన కోసం కేంద్రం తరఫున సీనియర్ హాజరైన న్యాయవాది రెండు వారాల గడువు కోరారు. ఈ మేరకు కోర్టు డిసెంబర్ 13న విచారణ కోసం జాబితా చేసింది. కృష్టా ట్రైబ్యునల్ ఉత్తర్వులు, గెజిట్ నోటిఫికేషన్ విడుదలపై ఫిటిషన్లను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టనున్నది. ఈ సందర్భంగా వాదనల వివరాలు ఇవ్వాలని తెలంగాణ, ఆంధప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రను త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. రాష్టాల్రు 3 పేజీలకు మించకుండా వాదనల వివరాలు ఇవ్వాలని, విచారణకు 48 గంటలలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.