కృష్ణా నీటి వాటా తేల్చండి..

` పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి
` ఖాళీ చేతులతో వచ్చి ఖాళీ చేతులతో వెళ్లడం ప్రధాని మోడీకి అలవాటైంది
` తెలంగాణకు క్షమాపణ చెప్పాకే పాలమూరులో కాలు మోపాలి
` అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లలో బిజెపి డిపాజిట్లు గల్లంతవుతాయ్‌..
` బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఫైర్‌
హైదరాబాద్‌ బ్యూరో, సెప్టెంబర్‌26 (జనంసాక్షి): కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా 575 టీఎంసీలు దక్కాల్సిందేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చని మోదీకి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాలు పెట్టే న్కెతిక హక్కు కూడా ఆయనకు లేదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాతిని దగా చేసిన పార్టీ, ద్రోహం చేసిన దగ్బులాజీ పార్టీ బీజేపీ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. అక్టోబర్‌ 1వ తేదీన పాలమూరు జిల్లా పర్యటనకు వస్తున్న మోదీపై కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. తెలంగాణ అమరుల త్యాగాలను కించపర్చిన ప్రధాని మోదీ క్షమాపణ చెప్పి మహబూబ్‌నగర్‌ రావాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పాలమూరు వలసల జిల్లా అనే నానుడి ఉంది.. దేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాల్లో ఒకట్కెన పాలమూరు జిల్లాకు మోదీ ఏం చేయలేదని కేటీఆర్‌ గుర్తు చేశారు. 2014 జూన్‌ 2న తెలంగాణ వస్తే జుల్కె 14న ఓ లేఖ తీసుకుని విరీ దరగ్గరకు కేసీఆర్‌ వచ్చారు. నీళ్లలో జరిగిన అన్యాయం గురించి మోదీకి వివరించారు. గోదావరి, కృష్ణా జలాలల్లో మా వాటా తేల్చాలని, అప్పుడే న్యాయబద్దమైన వాటా దక్కుతుందని కోరారు. పాలమూరు` రంగారెడ్డి ఎత్తిపోతలకు సహకరించండి, జాతీయ హోదా ఇవ్వాలని కోరాం. కాళేశ్వరం లేదా పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నోసార్లు అడిగాం. కరువులు, కన్నీళ్లు, వలసలతో గోసపడ్డ పాలమూరు ఇప్పుడే పచ్చబడు తుంటే.. ప్రధాన మంత్రి, ఆయన పార్టీ పగబట్టింది. కృష్ణా జలాల్లో వాటా తేల్చకపోగా, మరోవైపు జాతీయ హోదా ఇవ్వలేదు. అప్పర్‌ భద్రకు, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి పాలమూరును పక్కనపెట్టారు. పాలమూరు గడ్డ విరీద కాలుపెట్టే ముందు పాలమూరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి. కృష్ణా జలాల్లో వాటా తేల్చుతామని స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాము. ఒక్కో రాష్టాన్రికి ఒక్కో విధానాన్ని బిజెపి అవలంబిస్తుంది. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇస్తామని గతంలో బీజేపీ నాయకులు చెప్పారని కేటీఆర్‌ గుర్తు చేశారు. పర్యావరణ, ఇతర సాంకేతిక అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేశారు. దీనికి విరీరు బాధ్యులు కాదా..? కృష్ణా జలాల్లో వాటా తేల్చమని ట్రిబ్యునల్‌కు రెఫర్‌ చేయడానికి ఎందుకు మనసు రావడం లేదు. ఒక్క మాట, ఒక్క సంతకం పెట్టే తీరిక లేదా..? నికృష్ట రాజకీయం ఎందుకు అని మోదీని కేటీఆర్‌ నిలదీశారు.
రాష్ట్రం వచ్చిన 40 రోజులకే కృష్ణా జలాల కేటాయింపులపై కేంద్రానికి కేసీఆర్‌ లేఖ రాశారని కేటీఆర్‌ గుర్తు చేశారు. కేంద్రం స్పందించకపోతే ఏడాది వరకు వేచి చూశాం. ఆగస్టు 10, 2015నాడు సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించి న్యాయపోరాటం చేసింది. 2020, అక్టోబర్‌ 6న అపెక్స్‌ కౌన్సిల్‌లో కేంద్రాన్ని, జలవనరుల శాఖను కేసీఆర్‌ గట్టిగా నిలదీశారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని అడిగితే.. కేసు ఉపసంహరించుకోమని సూచించారు. కేసు విత్‌ డ్రా చేసుకున్న తర్వాత.. ఈ రోజు వరకు కనీసం ఉత్తరం రాసిన పాపాన పోలేదు. కృష్ణా జలాల్లో 811 టీఎంసీలను ఉమ్మడికి ఏపీకి బచావత్‌ ట్క్రెబ్యునల్‌ కేటాయించింది. 575 టీఎంసీలు మాకు దక్కాలనేది మా వాదన. ట్క్రెబ్యునల్‌కు ఉత్తరం రాయకుండా పాలమూరులో ఎలా అడుగుతపెడుతారని ప్రశ్నించారు. మోదీ నిర్వాకం వల్ల నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు వందల టీఎంసీల నీటిని కోల్పోతున్నాం. ఓట్ల వేట కోసమే మోదీ వస్తున్నారు. ఓట్లు కావాలంటే కూడా చేసిన మంచి పనులు చెప్పాలి. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి. ఖాళీ చేతులతో రావడం పోవడం విరీకు అలవాటే. వగల ప్రేమలు వలకబోసినా, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చినా.. మిమ్మల్ని, విరీ పార్టీని నమ్మరు. మళ్లీ డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని చెబుతున్నాను. ఈ సారైనా ప్రధాని స్పందించి, పాప పరిహారం చేసుకుంటారని, ఆ ప్రకాక్షళనలో భాగంగా మాకు న్యాయంగా రావాల్సిన వాటాను ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ తరపున డిమాండ్‌ చేస్తున్నాం అని కేటీఆర్‌ తెలిపారు.ఈ సందర్భంగా ప్రధానికి కొన్ని ప్రశ్నలు వేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు. పదేళ్లుగా రాష్ట్ర ఏర్పాటుపై ఎందుకు విషం చిమ్ముతున్నరు. పార్లమెంట్‌లో పలు మార్లు తెలంగాణను కించపరిచే విధంగా ఎందుకు మాట్లాడారు అంటూ ప్రశ్నలు కురిపించారు. తల్లిని చంపి బిడ్డను బ్రతికించారు అనడం వారి అజ్ఞానమన్నారు. 2014లో పుట్టగతులు లేకుండా పోయినట్లు రాబోయే ఎన్నికల్లో కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. త్యాగాలను అవమానించిన ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌లో కాలు పెట్టే అర్హత కూడా ప్రధాని లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని.. ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇవ్వకుండా జాప్యం కావడానికి బాధ్యులు తమరు కాదా అంటూ నిలదీశారు. ఈ సారి ఎన్నికల్లో కూడా 110 స్థానాల్లో విరీ పార్టీ డిపాజిట్‌ కోల్పోవడం ఖాయమని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారు.