‘కెప్టెన్’ ఒక డిఫరెంట్ సినిమా : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ఆర్య

 

ఆర్య కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘కెప్టెన్’. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించారు. థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో నిర్మాణ సంస్థ ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య నిర్మించారు. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ & హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్బంగా ..
హీరో ఆర్య మాట్లాడుతూ ”తెలుగు నా తొలి సినిమా ‘వరుడు’. అందులో అల్లు అర్జున్ గారితో నటించాను. ఆ సినిమా లో డైలాగులు అన్నీ ప్రోపర్ తెలుగు డైలాగులు. అవి చెప్పడానికి నేను కష్టపడ్డాను. నటుడిగా ఆ సినిమాతో చాలా నేర్చుకున్నాను. అల్లు అర్జున్ గారితో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సినిమాలకు వస్తే… డిఫరెంట్‌గా చేయకపోతే ఒకే తరహా సినిమాలకు పరిమితం అవుతాయి. కంఫర్ట్ పెరుగుతుంది. నాకు అది ఇష్టం లేదు. ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ డిఫరెంట్ ఫిల్మ్స్ చేయాలని అనుకుంటాను. ప్రేక్షకులు కూడా డిఫరెంట్ ఫిల్మ్స్ చూడటానికి ఇష్టపడుతున్నారు. ‘కెప్టెన్’ ఒక డిఫరెంట్ ఫిల్మ్. తెలుగులో సుధాకర్ రెడ్డి గారు విడుదల చేస్తున్నారు. ఈ విషయం సాయేషాకు చెబితే చాలా ఎగ్జైట్ అయ్యింది. ”అయామ్ సో హ్యాపీ. ఇది బ్లాక్ బస్టర్’ అని చెప్పింది. మా సినిమాను విడుదల చేస్తున్న సుధాకర్ రెడ్డి గారికి థాంక్స్. ఈ సినిమాతో ‘విక్రమ్’ సక్సెస్ కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను. ఆయన వెరీ పాజిటివ్ పర్సన్. ఆయనతో అసోసియేట్ అవ్వడం అంటే ఆల్రెడీ ఈ సినిమా హిట్. రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన లిరిక్స్ రాశారు. కొన్నిసార్లు తమిళ పాటల కంటే తెలుగు పాటలు బావున్నట్లు అనిపించాయి. తెలుగులో రాకీ (రాకేందు మౌళి) డైలాగులు రాశారు. ‘సార్‌ప‌ట్ట‌’ డైలాగులు కూడా అతనే రాశారు. నాకు బాగా నచ్చాయి. అందుకని, ఆ సినిమాకు రాయమని అడిగాను. ‘కెప్టెన్’ అవుట్‌పుట్‌ నాకు నచ్చింది. ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. ఈ సినిమాకు ముందు దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ తో ‘టెడ్డీ’ సినిమా చేశా. అతను చాలా బాగా చేశారు. ఇమాన్ సార్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. శక్తి, ఇమాన్ సార్ కాంబినేషన్ సూపర్ హిట్. నాలుగైదు సినిమాలు చేశారు. ఈ సినిమాకు పాటలతో పాటు అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. ఐశ్వర్య లక్ష్మీ వెరీ టాలెంటెడ్ యాక్టర్. ఆమె చాలా బాగా నటించారు. సిమ్రాన్ గారు చైల్డ్ హుడ్ క్రష్. నేను మాత్రమే కాదు… మా దర్శకుడు, కెమెరామేన్ అందరూ ఫస్ట్ షాట్ అయిన తర్వాత సెల్ఫీలు తీసుకున్నాం. ఆవిడ షూటింగ్ కు వస్తే… ఫ్యాన్ బాయ్ మూమెంట్ లా ఉండేది. ప్రేక్షకులకు ‘కెప్టెన్’ డిఫరెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌ ఇస్తుంది. సినిమా నిడివి రెండు గంటల లోపే. సెప్టెంబర్ 8న థియేటర్లలో చూడండి” అని అన్నారు.
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ”ఇవాళ ప్రేక్షకులు ఏమైతే కోరుకుంటున్నారో… అటువంటి డిఫరెంట్ ఫిల్మ్ ‘కెప్టెన్’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోంది. దాని కోసమే మా సంస్థలో విడుదల చేయాలని ఆర్యను కలిశా. ఆయన కూడా సంతోషంగా చేయమన్నారు. ఆర్య మా ఫ్యామిలీ మెంబర్. ఆయన భర్త సాయేశా సైగల్‌ను ‘అఖిల్’ సినిమా ద్వారా నేను ఇంట్రడ్యూస్ చేశా. ట్రైలర్, సాంగ్స్ చూశాం. ఆసక్తికరంగా ఉన్నాయి. తప్పకుండా పెద్ద విజయం సాధించి ఆర్యకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. సెప్టెంబర్ 8న థియేటర్లలో కలుద్దాం” అని అన్నారు.
నిర్మాత రాజ్ కుమార్ మాట్లాడుతూ ”గత ఏడాది ‘సార్‌ప‌ట్ట‌’ సినిమాను అందరూ చూసి ఉంటారు. అది ఓటీటీలో వచ్చింది కానీ… అందులో ఆర్య గారు అద్భుత అభినయం కనబరిచారు. కథల ఎంపికలో ఆయనది గొప్ప అభిరుచి. ఆ సినిమా థియేటర్లలో విడుదలై ఉంటే చాలా పెద్ద విజయం సాధించేది. ఈసారి ఆయన సైన్స్ ఫిక్షన్ కథ ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాతో మేం అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా సుధాకర్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ ‘విక్రమ్’ విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నారు. వాళ్ళ టీమ్‌లో నేనూ పార్ట్ కావడం గౌరవంగా, సంతోషంగా ఉంది” అని అన్నారు.
గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ”కొన్ని ప్రాజెక్టులు మన మనసుకు బాగా నచ్చుతాయి. అందులో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ‘కెప్టెన్’ ట్రైలర్ చాలా స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఎప్పుడు విడుదల అవుతుందా? అనే క్యూరియాసిటీ కలిగించింది. ఈ సినిమాలో వింత జీవి / కీటకం నాలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇప్పుడు కొత్త కథలు, ఐడియాలతో వస్తున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఏ భాషలో తీసినా ప్రపంచం అంతా చూస్తోంది. ‘విక్రమ్’ సినిమాతో భారీ విజయం అందుకున్న శ్రేష్ఠ్ మూవీస్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తోంది. వాళ్ళ విజన్ గొప్పది. ‘విక్రమ్’ వరవడిలో ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధించాలని, ఆర్యకు గొప్ప సక్సెస్ అందించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ ”ఆర్య గారు ‘వాడు వీడు’లో అద్భుతంగా నటించారు. ‘నేనే అంబానీ’లో సంతానం, ఆయనకు మధ్య కామెడీ టైమింగ్ సూపర్. ఇక, ‘రాజా రాణి’ సినిమాను అయితే మర్చిపోలేం. ఈసారి ‘కెప్టెన్’తో ఆయన వస్తున్నారు. ఆయన మంచి మనిషి. శ్రేష్ఠ్ మూవీస్ విడుదల చేసిన ‘విక్రమ్’లా ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ విన్న రెండు పాటలు చాలా బావున్నాయి. తెలుగు పాటలు విన్నట్లు ఉంది. రామజోగయ్య శాస్త్రి చక్కగా రాశారు” అని అన్నారు. నిర్మాత మహేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాళవికా అవినాష్, గోకుల్ ఆనంద్, భరత్ రాజ్, ఆదిత్యా మీనన్, సురేష్ మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కె. మాధవన్, ప్రొడక్షన్ కంట్రోలర్ : ఎస్. శివ కుమార్, సౌండ్ డిజైన్ : అరుణ్ శీను, సౌండ్ మిక్స్ : తపస్య నాయక్, కలరిస్ట్ : శివ శంకర్ .వి, వీఎఫ్ఎక్స్‌ సూపర్ వైజర్ : వి. అరుణ్ రాజ్, కాస్ట్యూమ్ డిజైనర్ : దీపాలీ నూర్, స్టంట్ డైరెక్టర్ : ఆర్. శక్తి శరవణన్, కె. గణేష్, ప్రొడక్షన్ డిజైన్ : ఎస్.ఎస్. మూర్తి, ఎడిటర్ : ప్రదీప్ ఇ. రాఘవ్, సినిమాటోగ్రఫీ : ఎస్. యువ, మ్యూజిక్ : డి ఇమాన్, రచన – దర్శకత్వం : శక్తి సౌందర్ రాజన్.