కెసిఆర్‌తోనే అభివృద్ది సాధ్యం: మాజీ ఎమ్మెల్యే
ఆదిలాబాద్,సెప్టెంబర్19(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. రాబోయో ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి మరోమారు తనన ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఏరాష్ట్రంలో అమలు చేయని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. వికలంగులతోపాటు విత్తంతు, ఒంటరి మహిళలు, వృద్ధులకు పింఛన్లు అందిస్తాందన్నారు. 60సంవత్సరాల్లో జరగని అభివృద్ధి కేవలం నాలుగు సంవత్సరాల్లోనే చేసిందన్నారు. కండ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు ఇంటింటికీ నల్లా నీటిని సరఫరా చేస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికల కన్నా ముందే మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధమైన నల్లా నీటిని అందించేలా సిఎం కెసిఆర్ ప్రణాళిక రూపొందించారని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు సంవత్సరాల కాలంలోనే వేల కోట్ల నిధులు మంజూరు చేసుకొని అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.